AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా.. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి.

వాతావరణంలో మార్పులు, కరోనా తర్వాత ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా రోజు రోజుకీ వాయు కాలుష్యం పెరుగుతోంది. దీంతో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారు సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకొక్కసారి ఊరి పీల్చుకోవడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊపిరితిత్తులు బలహీనంగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే రోజువారీ జీవితంలో కొన్ని రకాల చర్యలను పాటించాలి. 

Surya Kala
|

Updated on: Apr 02, 2024 | 11:19 AM

Share
అదే సమయంలో ఊపిరి తిత్తులకు ఆరోగ్యాన్ని అందించడంలో .. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కొన్ని రకాల వస్తువులు ముఖ్య పాత్రను పోషిస్తాయి. కనుక తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి. 

1 / 7
ముఖ్యంగా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లం శ్వాసకోశంలోని అన్ని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటివి ఉంటాయి.

2 / 7
తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రతిరోజూ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనెను వేసుకుని తాగవచ్చు. 

3 / 7
ఆస్తమా సమస్యతో ఇబ్బంది పడుతుంటే వెల్లుల్లిని తినవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే అల్లిసిన్ అనే నిర్దిష్ట పదార్ధం యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. వెల్లుల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు నివారణగా పనిచేస్తుంది. 

4 / 7
శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజు శరీరంలో కొంత మొత్తంలో పసుపు ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. పసుపు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

5 / 7

బరువు తగ్గడానికి గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే గ్రీన్ టీ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల నుండి బరువు తగ్గడం వరకు గ్రీన్ టీతో  అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

6 / 7

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానానికి బానిసలైతే.. ముందుగా ఆ అలవాటుని  మానేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఎన్ని రకాల చర్యలు తీసుకున్న బలవర్ధకమైన ఆహారం తీసుకున్నా దాని ఫలితం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన లంగ్స్ కోసం సిగరెట్, పొగాకు వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. 

7 / 7