Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real-life Barbie: అందంగా బార్బీగా మారాలని 43 సర్జరీలు చేయించుకున్న స్త్రీ.. చివరికి భయపెట్టే వింత రూపం..

ఎక్కువ మంది తమ శరీరంలో అవయవాలకు చిన్న చిన్న మార్పుల కోసం చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని.. తద్వారా తమ రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అతి కొద్దిమంది మాత్రం తమ రూపం మొత్తం మారిపోవాలని.. మొత్తం శరీరంలో మార్పులు చేసుకోవడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితులలో  కొన్నిసార్లు శస్త్రచికిత్స విఫలం అయి అనుకున్న రూపం కంటే భిన్నంగా కనిపిస్తుంది. ముఖం, శరీరం వికృతంగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న ఓ యువతి విషయంలో కూడా అలాంటిదే జరిగింది.

Real-life Barbie: అందంగా బార్బీగా మారాలని 43 సర్జరీలు చేయించుకున్న స్త్రీ.. చివరికి భయపెట్టే వింత రూపం..
Real Life BarbieImage Credit source: Instagram/dalia_naim1
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2024 | 10:55 AM

భగవంతుడు ఇచ్చిన సొంత రూపాన్ని ఇష్టపడేవారున్నారు.. అదే సమయంలో తమ రూపం నచ్చని వారు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో తమ రూపాన్ని మార్చుకోవడం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. అందరికంటే భిన్నంగా ఉండాలని కొందరు భావిస్తే.. అందంగా ఉండాలని కోరుకుంటూ అత్యంత ప్రమాదకరమైన శస్త్రచికిత్సలను చేయించుకునే వారు కూడా ఉన్నారు. అలా రూపం మార్చుకోవడనికి ఎక్కువగా ఆశ్రయించే పద్దతి ప్లాస్టిక్ సర్జరీ. అయితే ఎక్కువ మంది తమ శరీరంలో అవయవాలకు చిన్న చిన్న మార్పుల కోసం చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని.. తద్వారా తమ రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అతి కొద్దిమంది మాత్రం తమ రూపం మొత్తం మారిపోవాలని.. మొత్తం శరీరంలో మార్పులు చేసుకోవడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితులలో  కొన్నిసార్లు శస్త్రచికిత్స విఫలం అయి అనుకున్న రూపం కంటే భిన్నంగా కనిపిస్తుంది. ముఖం, శరీరం వికృతంగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న ఓ మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది.

నిజానికి, ఒక మహిళ బార్బీ బొమ్మలా అందంగా కనిపించాలని కోరుకుంది. దీని కోసం ఆమె ఒకటి కాదు రెండు  కాదు మొత్తం 43 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. దీని ప్రభావంతో ఆమె ముఖమే వింతగా కనిపించడం ప్రారంభించింది. ఇప్పుడు చాలా మంది ఆమెను ‘జాంబీ’ అని పిలవడం ప్రారంభించారు. ఆ స్త్రీ పేరు దాలియా నయీమ్. అయితే ప్రపంచం ఏమి చెప్పినా.. సరే ఆమె తనను తాను రియల్ లైఫ్ బార్బీ గర్ల్‌గా భావిస్తుంది.

జాంబీ అని పిలుస్తున్న ప్రజలు

మిర్రర్ నివేదిక ప్రకారం దాలియా ఇరాక్‌లోని బాగ్దాద్‌లో నివసిస్తోంది.  ప్రెజెంటర్గా, నటిగా పనిచేస్తోంది.  సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షల 95 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు  ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ వివిధ రకాల చిత్రాలు , వీడియోలను పోస్ట్ చేస్తుంది.. దలియా పోస్ట్ చేసే వీడియోలకు కూడా మంచి స్పందన ఉంటుంది. అయితే కొందరు ఆమెను ‘జాంబీ’ అని కూడా పిలుస్తారు. కొంతమంది ఆమెను ‘ఇరాకీ బార్బీ’ అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఫుల్ ఫేస్ సర్జరీ

డాలియా తన పెదవులతో పాటు, ముక్కు, ముఖం, రొమ్ము విస్తరణ శస్త్రచికిత్స చేయించుకుందని తెల్సుస్తోంది. ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన మేకప్ ఆర్టిస్ట్‌తో పోజులిచ్చింది. ఆ వీడియోలో మేకప్ ఆర్టిస్ట్ .. దాలియాతో ‘నువ్వు బార్బీ లాగా చాలా అందంగా కనిపిస్తున్నావు’ అని చెప్పగా, దానికి ప్రతిగా ఆమె కూడా అతడిని మెచ్చుకుంటూ నీ మేకప్ అద్భుతంగా ఉందని చెప్పింది. అయితే సోషల్ మీడియా వినియోగదారులు ఆమెను ‘జాంబీ’ అని ‘చెడు బార్బీ’ అని పిలుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..