AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పావురాలపై ప్రేమతో వృద్ధురాలు చేసిన పని.. ముళ్లుగా మారింది..! ఖరీదు రూ.2.5లక్షలు.. ఏం జరిగిందంటే..

పక్షులు, జంతువులను ప్రేమించే వ్యక్తులు వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. రోజూ ఇంటికి వచ్చే పక్షులను చిన్నపిల్లల్లా చూసుకుంటారు. వాటికి ఆహారం, నీరు అందిస్తారు ఇలా జంతువులు - పక్షులను చూసినప్పుడు మనలో ఒత్తిడి తగ్గిపోతుంది. చాలా మంది టైమ్ పాస్ కోసం పెంపుడు జంతువులు, పక్షులతో గడుపుతుంటారు. ఆ సమయం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్తాపం, ఒంటరితనం తగ్గుతాయి. అదే పక్షులు, పెంపుడు జంతువులను నాలుగైదు రోజులు చూడకుండా ఉండాల్సి వస్తే..కొందరు ఏకంగా మంచం పడుతుంటారు. అంతలా వాటిపై ప్రేమను పెంచుకుంటారు.

పావురాలపై ప్రేమతో వృద్ధురాలు చేసిన పని.. ముళ్లుగా మారింది..! ఖరీదు రూ.2.5లక్షలు.. ఏం జరిగిందంటే..
Feeding Pigeons
Jyothi Gadda
|

Updated on: Apr 02, 2024 | 11:27 AM

Share

పక్షులకు ఆహారం ఇవ్వడం, నీరు పెట్టడం శుభప్రదమని భారతీయుల నమ్మకం. పక్షుల కోసం ఇంటి పెరట్లో, డాబాపై ధాన్యాలు ఉంచుతారు. ఒక పాత్రలో నీటిని ఏర్పాటు చేస్తుంటారు. రోజూ తిండి దొరుకుతుందని తెలిస్తే పక్షులు రోజూ ఆ ప్రదేశానికి వచ్చి ధాన్యాన్ని తింటాయి. పక్షులలో పావురాల సంఖ్య మనలో ఎక్కువ. బెంగళూరు లాంటి నగరంలో మనం పగటిపూట టెర్రస్‌పై ఎగురుతున్న వేలాది పావురాలను చూడవచ్చు. కానీ, మీరు ఈ పావురాలను అతిగా ప్రేమిస్తే కొన్ని చోట్లా మీరు శిక్షించబడతారు. పావురాలకు ఆహారం ఇచ్చే ముందు, మీరు అక్కడ నియమాలను తెలుసుకోవాలి. ఎందుకంటే.. ఇక్కడ ఒక మహిళ అవేవీ పట్టించుకోకుండా పావురాలకు ఆహారం తినిపించింది. దాంతో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. పామురాలపై ఆమెకున్న ప్రేమ ముల్లులా గుచ్చింది. మునిసిపల్ కౌన్సిల్ ఆమెకు కఠినమైన నోటీసు జారీ చేసింది. ఆమెకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే…

అయితే, కొన్ని దేశాల్లో ఇంట్లోకి పావురాలు సహా ఏ పక్షికి అనుమతి లేదు. వీధుల్లో జంతువులు, పక్షులను ఆహారం ఇవ్వడం కూడా నేరం. మీరు కావాలంటే స్థానిక అధికారుల నుండి అనుమతి అవసరం. 97 ఏళ్ల అన్నే సిగో ఇప్పుడు పావురాలకు ఆహారం ఇచ్చినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అన్నే సిగో సంగీత ఉపాధ్యాయురాలు. ఆమె తన ఇంట్లో కొన్ని పక్షులను పెంచుతోంది. ఇంటికి వచ్చిన పావురాలకు ప్రతిరోజూ ధాన్యం వేస్తుంటారు. దాంతో అన్నే సిగో ఇంటికి చాలా పక్షులు వస్తుటాయి. దాంతో ఇరుగుపొరుగు వారు నగర మండలికి ఫిర్యాదు చేశారు. అన్నే సిగో పావురాలకు ఆహారం ఇవ్వడంతో పక్షులు ఇంటికి వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయమై అన్నే సిగోకు నగర పాలక సంస్థ నోటీసు ఇచ్చింది. అన్నే పట్టించుకోలేదు. తొలుత పదివేలు జరిమానా విధించిన నగర పాలక సంస్థ అధికారులు ఆ తర్వాత 2,500 పౌండ్లు అంటే 2.5 లక్షల రూపాయల జరిమానా విధించారు. అయితే దీనిపై అన్నే స్పందించకపోవడంతో తన 77 ఏళ్ల కుమారుడు అలాన్‌కు నోటీసులిచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్, థాయిలాండ్, కొలంబియా, కెనడా, అమెరికాతో సహా అనేక దేశాల్లో పక్షులకు ఆహారం ఇవ్వడం నేరం. పావురాలకు ఆహారం ఇవ్వడం నేరంగా చెబుతారు. ఎందుకంటే పక్షులు పర్యావరణాన్ని నాశనం చేయడమే కాకుండా కొన్ని వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
తండ్రి కాబోతున్న జబర్దస్త్ ప్రవీణ్.. బ్యూటిఫుల్ వీడియోతో..
తండ్రి కాబోతున్న జబర్దస్త్ ప్రవీణ్.. బ్యూటిఫుల్ వీడియోతో..