Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multani Mitti Benefits: ముఖాన్ని మెరిపించే ముల్తానీ మట్టితో కేశాలకు నిగారింపు..! ఇలా వాడితే జుట్టు ఒత్తుగా, స్టెయిట్‌గా పెరుగుతుందట..

తలలో పొడిబారడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ముల్తానీ మిట్టిని పాలతో కలిపి హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. పాలు మీ స్కాల్ప్‌ను తేమగా మార్చడంలో సహాయపడతాయి. ముల్తానీ మిట్టి స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది. ఈ మిశ్రమం జుట్టును మృదువుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.

Multani Mitti Benefits:  ముఖాన్ని మెరిపించే ముల్తానీ మట్టితో కేశాలకు నిగారింపు..! ఇలా వాడితే జుట్టు ఒత్తుగా, స్టెయిట్‌గా పెరుగుతుందట..
అంతేకాదు, ముల్తానీ మిట్టిన జుట్టు సమస్యకి పరిష్కారంగా కూడా వాడుతుంటారు. దీంతో చాలా జుట్టు సమస్యలు దూరమవుతాయి. ఆయిల్ స్కాల్ఫ్ ఉన్నవారికి ముల్తానీ మట్టి బెస్ట్ సొల్యూషన్. మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మురికి, నూనెని దూరం చేస్తుంది. అయితే, డ్రై హెయిర్ ఉన్నవారు దీనిని వాడకపోవడం మంచిది. దీనివల్ల స్కాల్ఫ్ మరింత పొడిగా మారుతుంది.
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 02, 2024 | 10:39 AM

పోషకాహార లోపం, సరైన జీవనశైలి కారణంగా జుట్టు రాలడం మొదలవుతుంది. ఈ కారణంగా జుట్టు పొడిబారడం, చిట్లిపోయే సమస్య తలెత్తుతుంది. చివరకు జుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా జుట్టుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా మూలాలు బలహీనపడతాయి. దీని కారణంగా ఎక్కువ జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ముల్తానీ మిట్టిని ఉపయోగించవచ్చు. ముల్తానీ మిట్టిలో ఉండే ముఖ్యమైన పోషకాలు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. ముల్తానీ మిట్టి హెయిర్‌ప్యాక్‌ వాడకంతో పొడిబారిన జుట్టు సమస్య కూడా తగ్గుతుంది. అలాగే, జుట్టు మూలాలు బలంగా మారుతాయి. జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ముల్తానీ మిట్టి హెయిర్‌ ప్యాక్‌ ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు రాలే సమస్యకు ముల్తానీ మిట్టి, పెరుగుతో హెయిర్‌ప్యాక్‌..

ముల్తానీ మిట్టి, పెరుగు కలిపి తలకు రాసుకుంటే తలలోని మురికి తొలగిపోతుంది. ఇది స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ప్యాక్‌ తయారు చేయడానికి ఒక గిన్నెలో 2 స్పూన్ల ముల్తానీ మిట్టిని తీసుకోండి. ఇప్పుడు దానికి 3 చెంచాల పెరుగు వేయాలి. పేస్ట్‌లా చేసి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ముల్తానీ మిట్టి, అలోవెరా జెల్..

ముల్తానీ మిట్టిని కలబంద జెల్‌తో కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మీరు దీన్ని ఉపయోగించడం ద్వారా పొడిబారిన జుట్టు, చిట్లిపోయే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయడానికి మీరు 2 స్పూన్ల ముల్తానీ మిట్టిని తీసుకోవాలి. ఇప్పుడు దానికి 3 చెంచాల అలోవెరా జెల్ కలపండి. పేస్ట్‌లా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత వాష్‌ చేసుకోవాలి.

జుట్టు రాలడానికి ముల్తానీ మిట్టి, టీ డికాక్షన్..

డికాక్షన్‌తో ముల్తానీ మిట్టిని మిక్స్‌ చేసి హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్‌ ప్యాక్‌తో జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం టీ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఇప్పుడు దాని నీటిని ఫిల్టర్ చేయండి. చల్లారిన తర్వాత అందులో ముల్తానీ మిట్టి వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. జుట్టు మీద 30 నిమిషాల పాటు ఉంచి, ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

జుట్టు రాలడానికి ముల్తానీ మిట్టి, ఉసిరికాయలతో హెయిర్‌ప్యాక్‌…

ఉసిరికాయతో కలుపుకుంటే చాలా జుట్టు సమస్యలను నయం చేస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. తల దురదను కూడా తగ్గిస్తుంది. హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయడానికి, మీరు ముల్తానీ మిట్టిలో ఉసిరి, షికాకాయ్, రీటా, నీటిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు మీద 30-40 నిమిషాలు ఉంచండి. బాగా ఆరిన తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

జుట్టు రాలడానికి ముల్తానీ మిట్టి, పాలు..

తలలో పొడిబారడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ముల్తానీ మిట్టిని పాలతో కలిపి హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. పాలు మీ స్కాల్ప్‌ను తేమగా మార్చడంలో సహాయపడతాయి. ముల్తానీ మిట్టి స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది. ఈ మిశ్రమం జుట్టును మృదువుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..