AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీలోని అతిపెద్ద భయం ఈ ఫోటో చెప్పేస్తుంది.! మొదటిగా ఏం కనిపిస్తోందో చెప్పండి..

ఆప్టికల్ ఇల్యూషన్.. ఈ పదంతో నెటిజన్లకు పెద్దగా పరిచయమక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలే ఉంటాయి. ఇవి మన బుర్రను మభ్యపెట్టడమే కాదు.. మన కంటి చూపునకు కూడా పెద్ద పరీక్ష పెడతాయి. అయితే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలతో మనిషి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చునని తెలుసా.?

మీలోని అతిపెద్ద భయం ఈ ఫోటో చెప్పేస్తుంది.! మొదటిగా ఏం కనిపిస్తోందో చెప్పండి..
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Apr 02, 2024 | 11:56 AM

Share

ఆప్టికల్ ఇల్యూషన్.. ఈ పదంతో నెటిజన్లకు పెద్దగా పరిచయమక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలే ఉంటాయి. ఇవి మన బుర్రను మభ్యపెట్టడమే కాదు.. మన కంటి చూపునకు కూడా పెద్ద పరీక్ష పెడతాయి. అయితే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలతో మనిషి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చునని తెలుసా.? అవునని అంటున్నారు సైకాలజిస్టులు. ఓ ఫోటోను ఒక మనిషి చూసే దృక్కోణం బట్టే.. అతడి మనస్తత్వం, ఆలోచనలు ముడిపడి ఉన్నాయంటున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో పైకి కనిపించేవి ఒకటైతే.. లోపలున్నవి మరొకటి. లోపల అంతర్ఘతంగా దాగున్న సమాధానాలను కనుక్కోవడమే ఇక్కడ మన ముందున్న పెద్ద సవాల్. సరే ఇదంతా పక్కన పెడితే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోల ద్వారా మీ వ్యక్తిత్వాన్ని ఎలా కనిపెట్టొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీ అతిపెద్ద భయం ఏంటో చెప్పేస్తుంది.

మీరు ముందుగా కంటిని చూసినట్టయితే..

ఈ ఫోటోలో మొదటిగా కంటిని చూసినట్టయితే.. మీరు మార్పు, అనిశ్చితికి భయపడుతున్నారని అర్ధం. ప్రస్తుత అంశాలన్నీ కూడా సజావుగా సాగుతున్నప్పటికీ.. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్టు లెక్క. అలాగే మీరు మీ జీవితంలో పలు మార్పులు చేసుకోవాలని అనుకుంటారు. కానీ కంఫోర్ట్ జోన్ నుంచి మాత్రం బయటపడరు. మీకున్న ఈ భయమే మిమ్మల్ని లక్ష్యాలు చేరుకోవడంలో, కొత్త విషయాలను నేర్చుకోవడంలో అడ్డుతగులుతుంది. కానీ ఒక్కసారి మీరు మార్పును కోరుకున్నట్లయితే.. నెమ్మదిగా మీ జీవితం మేరుగుపడటమే కాదు.. కొత్త అవకాశాలు, సరికొత్త అనుభవాలను మీరు ఆస్వాదించవచ్చు.

ఓ గుంత.. చుట్టూ పచ్చని చెట్లు.. మీకు కనిపించినట్లయితే..

మీరు చాలా సున్నితమైన మనస్కులు అని అర్ధం. ఇతరుల అభిప్రాయాలు లేదా కామెంట్స్ మీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మీ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసేలా.. అవి చాలాకాలం మీ వెంటే ఉంటాయి. ఇతరులు ఏమనుకుంటున్నారోనన్న దానిపై మీరు చాలా శ్రద్ధ వహిస్తారు. మీ సొంత ఒపీనియన్‌పైనా ఆలోచించరు. దీని కారణంగానే మీరు ఇతరులను సంతోషపెట్టే వాటి గురించి అలోచించి.. మీ సొంత అవసరాలను కూడా పక్కన పెట్టేస్తారు. ప్రతీ విషయానికి కొన్ని బౌండరీస్ పెట్టుకోండి.. మీ కోసం మీరు నిలబడండి. అప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన ఆలోచనలు తీసుకోవడంలో సహాయపడుతుంది.