Ugadi Panchangam: పంచాంగం అంటే ఏమిటి? ఉగాది పంచాంగ శ్రవణ విశిష్టత.. ఏ విషయాలు తెలుసుకుంటారంటే..

ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వినడం శుభమని పండితులు చెప్పారు. కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశిఫలాలు, స్థితిగతులను గురించి తెలుసుకుని అందుకు తగిన విధంగా శాంతులను చేసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేసి చెబుతారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని పెద్దలంటారు.

Ugadi Panchangam: పంచాంగం అంటే ఏమిటి? ఉగాది పంచాంగ శ్రవణ విశిష్టత.. ఏ విషయాలు తెలుసుకుంటారంటే..
Ugadi Panchangam
Follow us

|

Updated on: Apr 03, 2024 | 12:14 PM

ఉగాది అంటేనే వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి. తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభం అయిన మొదటి రోజున అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది పర్వదినం ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. ఈ ఏడాది తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఉగాది రోజున పంచాంగం వినడం ఆనవాయితీ. ప్రతి ఒక్కరూ తమ ఆదాయ, వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకోవాలని భావిస్తారు. అయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడానికి చేయడానికి కొన్ని నియమాలున్నాయి. అవి ఏమిటంటే..

ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వినడం శుభమని పండితులు చెప్పారు. కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశి ఫలాలు, స్థితిగతులను గురించి తెలుసుకుని అందుకు తగిన విధంగా శాంతులను చేసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేసి చెబుతారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని పెద్దలంటారు.

పంచాంగ శ్రవణంలో తెలుసుకునే విషయాలు

పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. గత కొంత కాలం వరకూ రైతులు తాము పండించే పంటలు ఎలా ఉండనున్నాయి? ఏరువాక ఎలా సాగాలి, వర్షాలు ఎలా కురుస్తాయి వంటి అనేక విషయాలు తెలుసుకునే వారు. అంతేకాదు శుభకార్యాలకు ముహర్తం పెట్టడం కోసం, పూజాదికార్యక్రమాల వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి పంచాంగాన్ని ఉపయోగిస్తారు. ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమల్లోకి వచ్చి.. మళ్ళీ కొత్త సంవత్సరం ముందు రోజు వరకూ అమల్లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తెలుగు సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

పంచాంగం అంటే ఏమిటంటే..

తిధి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంగములు కలది కనుక ‘పంచాంగం’ అంటారు. మానవుల జీవితాల కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉంటుంది. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి జన్మించింది మొదలు మరణించే వరకూ గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రం బట్టి జాతక రచన జరుగుతుంది. వీటికి  పంచాంగమే ప్రమాణము.

ఉగాది రోజున సాయంత్రం దేవాలయాల్లో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని నమ్మకం. జ్యోతిష శాస్త్రం చెప్పే ఫలితాలను తెలుసుకుంటారు. కొత్త ఏడాదిలో తాము తీసుకోవాల్సిన లేదా చేయాల్సిన పనుల గురించి తగినట్లు ప్రణాళికలను రెడీ చేసుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!