దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా కూడా కొబ్బరి కాయ కొట్టవచ్చా… ఫన్నీ వీడియో వైరల్
హిందువులు కొబ్బరి కాయను అత్యంత పవిత్రంగా భావిస్తారు. పూజ, శుభకార్యాల్లో తప్పని సారిగా కొబ్బరి కాయను ఉపయోగిస్తారు. ఇక కొబ్బరి నీరు తాగడం వలన కూడా ఎన్నో లాభాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే దేవుడికి కొబ్బరి కాయను కొట్టడానికి కత్తి, రాయి వంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే ఒక యువకుడు కొబ్బరికాయను వింతగా పగలగొడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అది చూసిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా నవ్వును నియంత్రించుకోలేరు.
ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తూ మనం చాలా సమయాన్ని బాగా గడుపుతాము. అయితే కొన్ని వీడియో క్లిప్‌లను చూసి నవ్విన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది చాలాసార్లు జరుగుతుంది. కొన్నిటిని చూసిన తర్వాత షాక్ అవుతాం కూడా. అయితే కొన్ని రకాల వీడియోలు స్పెషాలిటీగా ఉంటే వాటిని పదే పదే చూడటమే కాదు.. ఒకరితో ఒకరు విస్తృతంగా పంచుకుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన తర్వాత మీరు కూడా మీ నవ్వును అదుపులో పెట్టుకోలేరు.
హిందువులు కొబ్బరి కాయను అత్యంత పవిత్రంగా భావిస్తారు. పూజ, శుభకార్యాల్లో తప్పని సారిగా కొబ్బరి కాయను ఉపయోగిస్తారు. ఇక కొబ్బరి నీరు తాగడం వలన కూడా ఎన్నో లాభాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే దేవుడికి కొబ్బరి కాయను కొట్టడానికి కత్తి, రాయి వంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే ఒక యువకుడు కొబ్బరికాయను వింతగా పగలగొడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అది చూసిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా నవ్వును నియంత్రించుకోలేరు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
పూజ సమయంలో ఓ వ్యక్తి నిలబడి మంత్రం చదువుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో, అతని చేతుల్లో ఒక కొబ్బరికాయ కనిపించింది. అంతలో అతను అకస్మాత్తుగా ఆ కొబ్బరికాయను తన తలపై వరకూ తీసుకుని వెళ్ళాడు.. తర్వాత కొబ్బరి కాయను తన నుదిటితో పగలగొట్టాడు. ఈ ప్రయత్నంలో కొబ్బరికాయ రెండుగా పగిలింది. అప్పుడు ఆ యువకుడు పూజ గది నుంచి మరో రూమ్ లోకి అడుగు పెట్టి.. అక్కడ కింద పడి స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. అదృష్టమేమిటంటే అక్కడ ఉన్నవారు అతనికి సహకరించారు.
dr.sosmedt అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాలో క్లిప్ షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను తొమ్మిది లక్షల మందికి పైగా లైక్ చేసారు. రకరకాల కామెంట్స్ చేశారు. ఈ వీడియో చూసి కొంతమంది నవ్వుకున్నారు కూడా. ఆ వ్యక్తి ‘ఆరాధన పట్ల అంకితభావం’ అని కొందరు సరదాగా ప్రశంసించారు. ఇది చాలా ప్రమాదకరమని, ఇలా చేయకూడదని చాలా మంది అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..