Viral Video: పాముల్ని చాక్లెట్స్‌లా అమ్మేస్తున్న యువకుడు.. రద్దీ రోడ్డులో రండి బాబు.. రండి అంటూ
అతను పాములను అమ్మడానికి తన ట్రిక్ ప్లే చేస్తున్నాడు. పాములు.. పాములు అంటూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, అతను కూరగాయలు లేదంటే ఏవో పండ్లు అమ్ముతున్నట్లుగా అతని చుట్టుపక్కల వ్యక్తులు కూడా ఎలాంటి భయం లేకుండా, అతన్ని ఎవరూ పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు వెళ్లిపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తుంటాం. వీడియో చూడగానే.. వెంటనే ఇష్టపడే వీడియోలు కొన్ని ఉంటాయి. మరికొన్ని వాటిని విస్మరించి ముందుకు సాగుతాం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎవరూ ఊహించిన వ్యాపారం చేస్తున్నాడు. చిన్న చిన్న విషపూరిత పాములను తన చేతులపై వేలాడదీసుకుని మార్కెట్లో తిరుగుతూ విక్రయిస్తున్నాడు. వాటిని స్లీవ్‌లెస్ పాములుగా పేర్కొంటూ విక్రయిస్తున్నాడన్నది అత్యంత ఆసక్తికరమైన అంశం. పూర్తి వివరాల్లోకి వెళితే..
బజారులో బట్టలు, గడియారాలు, ఇతర వస్తువులను విక్రయించే హాకర్లను మీరు చూసినట్లుగానే ఈ వీడియోలో కూడా ఒక వ్యక్తి చిన్న పాములను తన చేతిపై వేలాడదీసుకుని, అవేవో రబ్బరు బ్యాండ్లు, చిన్న పిల్లల బెల్టులు అన్నట్టుగా నిర్భయంగా విక్రయిస్తున్నాడు. అతడు తన చేతులపై అనేక డజన్ల కొద్దీ పాములను వేలాడదీసుకుని రోడ్డు పక్కన నిలబడి అమ్ముతున్నాడు. అతని ఒక చేతిలో పాములు వేలాడుతున్నాయి. అంతేకాదు.. అతను రెండు చిన్న పాములను తన అరచేతులతో పట్టుకున్నాడు. అతను పాములను అమ్మడానికి తన ట్రిక్ ప్లే చేస్తున్నాడు. పాములు.. పాములు అంటూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, అతను కూరగాయలు లేదంటే ఏవో పండ్లు అమ్ముతున్నట్లుగా అతని చుట్టుపక్కల వ్యక్తులు కూడా ఎలాంటి భయం లేకుండా, అతన్ని ఎవరూ పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు వెళ్లిపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.
View this post on Instagram
ఈ వీడియో ఫహద్ ఖాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయబడింది. ఇది ప్రజల భావాలను దెబ్బతీస్తోంది. ఈ వీడియోపై ప్రజలు తమ తమ స్పందనలను తెలియజేశారు. ఈ వీడియోని 5.7 లక్షల మంది లైక్ చేశారు. ఇదెలా సాధ్యం.. ఈ వీడియో నిజమైనదేనా..? లేదంటే రీల్స్ కోసం ఇలా క్రియేట్ చేశారా అంటూ కొందరు సందేహం వ్యక్తం చేశారు. మన దేశంలో ఇలాంటివి నిషేధం అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..