Temple Bell: గుడి గంట మ్రోగించడంలో శాస్త్రీయ కోణం, బయటకు వచ్చే సమయంలో ఎందుకు మ్రోగించకూడదంటే..
వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయ గంట సానుకూల శక్తికి చిహ్నం. గుడిలోకి ప్రవేశించేటపుడు గంట కొట్టే సంప్రదాయం దాదాపు అందరికి తెలిసిందే.. అందుకే గుడిలోకి ప్రవేశించిన వెంటనే గంట కొడతారు. అయితే చాలా మంది గుడిలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా గంట మోగిస్తారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం తప్పుగా పరిగణించబడుతుంది. ధ్వని శక్తికి సంబంధించినది..కనుక గంట కొట్టడం శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఆలయ గంటను మోగించినప్పుడల్లా గంట మోగించేవారికి , చుట్టుపక్కల ప్రజలకు సానుకూల శక్తి ప్రసారం అవుతుందని నమ్ముతారు.
మనం గుడిలోకి ప్రవేశించిన వెంటనే చేసే మొదటి పని గుడిలో అమర్చిన గంటను మోగించడం, ఆ తర్వాత మాత్రమే అందరూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగించే ఈ సంప్రదాయం లేదా ఆచారం శతాబ్దాల నాటిది. ఇది నేటికీ అనుసరిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు గంట మోగిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయంలో గంటను మోగించడంలో అనేక మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. దీనితో పాటు ఆలయ గంటను మోగించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు పేర్కొనబడ్డాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయ గంట సానుకూల శక్తికి చిహ్నం. గుడిలోకి ప్రవేశించేటపుడు గంట కొట్టే సంప్రదాయం దాదాపు అందరికి తెలిసిందే.. అందుకే గుడిలోకి ప్రవేశించిన వెంటనే గంట కొడతారు. అయితే చాలా మంది గుడిలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా గంట మోగిస్తారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం తప్పుగా పరిగణించబడుతుంది.
దేవాలయాల్లో గంటలు ఎందుకు మోగిస్తారు?
ధ్వని శక్తికి సంబంధించినది..కనుక గంట కొట్టడం శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఆలయ గంటను మోగించినప్పుడల్లా గంట మోగించేవారికి , చుట్టుపక్కల ప్రజలకు సానుకూల శక్తి ప్రసారం అవుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రంతో పాటు స్కందపురాణంలో కూడా ఆలయ గంటను మోగిస్తే అది ‘ఓం’ శబ్దాన్ని పోలి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఓం’ శబ్దం చాలా స్వచ్ఛమైన, పవిత్రమైన, సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. అందుకే ఆలయంలోకి ప్రవేశించే సమయంలో గంటను మోగించే సంప్రదాయం ఉంది.
గుడిలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు ఏర్పడతాయని.. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న అన్ని బ్యాక్టీరియా. వైరస్‌లు లేదా బాక్టీరియా నాశనం అవుతాయని.అందుకే పరిసరాలను శుద్ధి చేస్తుంది. గంట మోగించడంలో శాస్త్రీయమైన అంశం కూడా ఉంది.
అందుకే గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంట మోగించకూడదా?
గుడి నుండి బయటకు వచ్చేటపుడు చాలా మంది బెల్ కొట్టడం మీరు తరచుగా చూసి ఉంటారు. గుడి నుంచి బయటకు వచ్చే సమయంలో గంట మోగించడం తప్పుగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయం నుండి బయటకు వెళ్లేటప్పుడు గంటను మోగించకూడదు ఎందుకంటే అలా చేయడం ద్వారా ఆలయంలోని సానుకూల శక్తిని అక్కడ వదిలివేస్తారు. కనుక ఆలయం నుంచి బయటకు వచ్చే సమయంలో గంటను మోగించకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు