Telangana: తెలంగాణాలో తీవ్ర వర్షాభావం.. డెడ్ స్టోరేజికి ప్రాజెక్టులు.. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి

తెలంగాణలో క‌రువు తీవ్ర స‌మ‌స్యగా మారుతుంది. 2023 అక్టోబర్ నుంచి తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. సాధారణంగా కురవాల్సిన వర్షపాతంతో పోలిస్తే 56.7% లోటు ఉండ‌టంతో రైతుల్లో ఆందోళ‌న మొద‌లైంది. నిరుడు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53% అధికంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 5% అధిక వర్షపాతం కనిపించినా.. అక్టోబర్ నుంచి ఆశించినట్లుగా వర్షాలు లేక‌పోవ‌డం ఇప్పుడు ఆందోళ‌నక‌రంగా మారింది.

Telangana: తెలంగాణాలో తీవ్ర వర్షాభావం.. డెడ్ స్టోరేజికి ప్రాజెక్టులు.. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి
Water Crisis In Telangana
Follow us

|

Updated on: Apr 03, 2024 | 7:20 AM

తెలంగాణలో వర్షాభావ ప‌రిస్థితులు రైతులను భ‌యపెడుతున్నాయి. ప్రాజెక్ట్ ల‌లో కూడ నీళ్లు లేక డెడ్ స్టోరేజికి చేరుతున్నాయి. రిజ‌ర్వాయ‌ర్లు డెడ్ స్టోరేజీల‌కు చేర‌డం అన్నదాతలను ఆందోళ‌న‌లో ప‌డేస్తోంది. దీనిపై ఫోక‌స్ చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. హైద‌రాబాద్‌లో తాగునీటి స‌మ‌స్య వ‌స్తే ఏలా అనే అంశంపై సుదీర్ఘంగా స‌మీక్ష చేశారు సీఎం రేవంత్. బెంగళూరు దుస్థితి హైదరాబాద్‌కు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

తెలంగాణలో క‌రువు తీవ్ర స‌మ‌స్యగా మారుతుంది. 2023 అక్టోబర్ నుంచి తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. సాధారణంగా కురవాల్సిన వర్షపాతంతో పోలిస్తే 56.7% లోటు ఉండ‌టంతో రైతుల్లో ఆందోళ‌న మొద‌లైంది. నిరుడు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53% అధికంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 5% అధిక వర్షపాతం కనిపించినా.. అక్టోబర్ నుంచి ఆశించినట్లుగా వర్షాలు లేక‌పోవ‌డం ఇప్పుడు ఆందోళ‌నక‌రంగా మారింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు సాధారణంగా 136.9 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 59.2 మి.మీ.ల వర్షపాతం మాత్రమే రికార్డయింది.

అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టింది….కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రంలో ఉన్న 14 ప్రధాన రిజర్వాయర్లు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. వర్షాలు లేకపోవటంతో భూగర్భ జల మట్టం కూడా అడుగంటింది. మార్చి నెలలో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2.5 మీటర్లు లోతుకు చేరింది. కృష్ణా బేసిన్లోని జూరాలలో ప్రస్తుతం 154.05 టీఎంసీల ఇన్ ఫ్లో ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం 34.38 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. నాగార్జునసాగర్ లో ప్రస్తుతం 137.52 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

నాగార్జునసాగర్ కింద 2024 రబీ సీజన్లో 6 లక్షల ఎకరాల పంటల సాగుకు 50 టీఎంసీల నీళ్లు అవసరం. ఇక్కడ ఏడాది పొడవునా అందుబాటులో ఉన్న నీళ్లు 35 టీఎంసీలు. అందులో నుంచి 27 టీఎంసీల నీటిని గత ప్రభుత్వం వానాకాలంలోనే కాల్వలకు విడుదల చేసింది. మిగిలిన 8 టీఎంసీలు పంటలకు సరిపోద‌ని ఇరిగేష‌న్ శాఖ చెబుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే సాగర్ కింద ఆయకట్టు రైతులకు నీళ్లివ్వలేమని స్పష్టం చేసింది.

అటు గోదావరి పరిధిలోని ఎస్సారెస్పీకి 2023–24లో వచ్చిన సగటు ఇన్ఫ్లో 205.75 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 7.85 టీఎంసీల నీళ్లున్నాయి. మొత్తం 20.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే టైమ్ లో 12.26 టీఎంసీలున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ మట్టం 485.56 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 466.79 అడుగులుగా ఉన్నాయి.

హైదరాబాద్‌ జంట నగ‌రాల తాగునీటిపై కూడా ఫోక‌స్ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతానికి హైదరాబాద్ కు తాగునీటిని సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, అక్కంపల్లి.. మొత్తం అయిదు రిజర్వాయర్లలో 25.38 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ అయిదు రిజర్వాయర్ల ఫుల్ ట్యాంక్ సామర్థ్యం 39.783 టీఎంసీలు. కానీ ఇప్పుడు నీళ్లు త‌క్కువగా ఉండ‌టం వ‌ల్ల దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి జంట న‌గ‌రాల నీటి స‌ప్లై లో ఎలాంటి అవంతరాలు రావొద్దని ఇప్పటికే అధికారుల‌కు సూచించింది ప్రభుత్వం. బెంగళూరు పరిస్థితి హైదరాబాద్‌లో తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

క‌రువు పరిస్థితులపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే రిజర్వాయర్ల నీటిస్థాయిలు, వివరాలతో నివేదిక తెప్పించుకుంది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తోంది. అధికారుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వహించి పీక్ స‌మ్మర్‌ను హ్యండిల్ చేయ‌డంతో పాటుగా, పంటల‌కు అవ‌స‌ర‌మైన నీళ్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అటు తాగునీటి కోసం ఇప్పటికే ప్రతిపాద‌న‌లు సిద్ధం చేశారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles