AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Currency: హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. ఆరుగురు అరెస్టు!

ఫేక్ కరెన్సీ అడ్డుకట్టకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా చెక్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ బేగం బజార్ పోలీసులతో కలిసి కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్న ఆరుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి ప్రింటింగ్ మెటీరియల్ తో పాటు రూ.28 వేల నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక బజాజ్ ప్లాటినా బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

Fake Currency: హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. ఆరుగురు అరెస్టు!
Indian Currency
Balu Jajala
|

Updated on: Apr 02, 2024 | 10:08 PM

Share

ఫేక్ కరెన్సీ అడ్డుకట్టకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా చెక్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ బేగం బజార్ పోలీసులతో కలిసి కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్న ఆరుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి ప్రింటింగ్ మెటీరియల్ తో పాటు రూ.28 వేల నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక బజాజ్ ప్లాటినా బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పబ్బాటి మురళీకృష్ణ (38), ఖాదర్ కుమార్ (30), మహేందర్ దాస్ వైష్ణవ్ (30), దశరథ్ కుమార్ పర్మార్ (27), మాలి రాజూరామ్ (25), ప్రవీణ్ కుమార్ మాలి (29) పోలీసులకు పట్టుబడ్డారు.

పబ్బాటి మురళీకృష్ణ అనే వ్యక్తి ముఠాకు బాస్ కు వ్యవహరిస్తూ మనదేశ నకిలీ కరెన్సీ నోట్ల ముద్రిస్తున్నాడు. గత ఏడాది నవంబర్ లో మునిరాజు అనే వ్యక్తికి వ్యాపారం చేసే ఖాదర్ తో పరిచయం ఏర్పడింది. పబ్బాటి మురళీకృష్ణ సహకారంతో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ అద్దె గదిలో నకిలీ కరెన్సీ తయారు చేయడం మొదలుపెట్టారు వీరంతా. అయితే అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్న మురళీకృష్ణ.. ఖాదర్ ద్వారా నకిలీ కరెన్సీ ముద్రణ, పంపిణీ ప్రారంభించాడు. రూ.లక్ష విలువైన నకిలీ నోట్లను రూ.14 వేలకు ఖాదర్ కు ఇస్తుంటారు.

అయితే కుక్కర్లు, మిక్సర్లు రిపేర్ చేయడంలో టాలెంట్ ఉన్న మహేందర్ ను సంప్రదించి నకిలీ కరెన్సీ చలామణి, లాభాల గురించి వివరించాడు. మహేందర్ కు రూ.లక్ష విలువైన నకిలీ కరెన్సీని రూ.17 వేలకు ఆఫర్ చేయడంతో  ఇతర వ్యక్తుల ద్వారా నకిలీ కరెన్సీని బహిరంగ మార్కెట్లో చలామణి చేశాడు. దశరథ్ కుమార్ పర్మార్, మాలి రాజురామ్, ప్రవీణ్ కుమార్ నకిలీ కరెన్సీ ఇస్తూ కమీషన్ తీసుకున్నారు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో నిఘా వేసి పట్టుకున్నారు. నగదు లావాదేవీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలను కొనసాగించేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన గుర్తింపును గమనించాలని కోరుతున్నారు. నకిలీ కరెన్సీని అందుకున్నా, గుర్తించినా పోలీసులకు లేదా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని సంబధిత అధికారులు కోరుతున్నారు.