AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి.. నిబంధనలను పాటించకపోతే చర్యలు తప్పవు!

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి..దీని దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా వేసవికాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సన్నద్ధం అయ్యింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అగ్నిప్రమాదాలపై దృష్టి పెట్టింది ఫైర్ సర్వీసెస్ సిబ్బంది. వేసవికాలం కావడంతో అగ్నిప్రమాదాలు మరింత అవ్వడానికి ఆస్కారం ఉండడంతో ఎక్కడికి ఎక్కడ తనిఖీలను చేపట్టింది. అయితే గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 8151 అగ్నిప్రమాదాలు సంభవించగా అందులో మేజర్ గా 141 అగ్నిప్రమాదాలు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ […]

Fire Accident: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి.. నిబంధనలను పాటించకపోతే చర్యలు తప్పవు!
Fire Accident
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Apr 02, 2024 | 9:16 PM

Share

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి..దీని దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా వేసవికాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సన్నద్ధం అయ్యింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అగ్నిప్రమాదాలపై దృష్టి పెట్టింది ఫైర్ సర్వీసెస్ సిబ్బంది. వేసవికాలం కావడంతో అగ్నిప్రమాదాలు మరింత అవ్వడానికి ఆస్కారం ఉండడంతో ఎక్కడికి ఎక్కడ తనిఖీలను చేపట్టింది. అయితే గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 8151 అగ్నిప్రమాదాలు సంభవించగా అందులో మేజర్ గా 141 అగ్నిప్రమాదాలు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. 2024 జనవరి నుండి ఇప్పటివరకు అనగా 4 నెలల వ్యవధిలోనే 2550 అగ్ని ప్రమాదాలు సంభవించాయి.

ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకోవడంతో ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై హాస్పిటల్స్ పరిశ్రమలు అవుట్డోర్ గోదాములపై క్షుణ్ణంగా తనిఖీలను చేపట్టింది ఫైర్ డిపార్ట్మెంట్. ఇప్పటివరకు 3060 భవనాలను తనిఖీలు చేయగా 80 భవనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకపోవడంతో నోటీసులను జారీ చేస్తుంది. ఇకపోతే జనావాసాల మధ్య గోదాములు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. వేసవికాలం ప్రారంభంలోనే స్టోరేజ్ గోదాములతో పాటు పరిశ్రమలు ఇళ్లల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ అధికారులు సూచిస్తున్నారు ఏదైనా విపత్తు జరిగినప్పుడు 101 ఫిర్యాదు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ నాగిరెడ్డి సూచించారు.

వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని అగ్నిమాపక కేంద్రాల అన్ని స్టేషన్లలో మాక్ డ్రిల్స్ ను కొనసాగిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితిలోనైనా రెస్క్యూ చేసేందుకు సన్నద్ధం అవుతుంది ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలకు గాను తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తుంది. సమ్మర్ లో ఫ్యాన్లు, ఏసీలు వాడకం విపరీతంగా పెరిగిపోతుంటుంది అందువలన విద్యుత్ ఓవర్ లోడ్ కావడంతో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ అగ్నిప్రమాదాలు బారిన పడకుండా ఉండాలని ఫైర్ సిబ్బంది అధికారులు చెబుతున్నారు.