పాతబస్తీలో రంజాన్ సందడి.. చార్మినార్ చుట్టూ కళకళలాడుతున్న షాపులు
రంజాన్ మాసం. పాతబస్తీలో ఏ గల్లీ చూసినా రద్దీ. అడుగడుగునా జనం. మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. చార్మినార్ ప్రధాన రోడ్డులో ఒక్కోసారి కాలినడక కూడా సాధ్యం కావడం లేదు. వినియోగదారులతో దుకాణాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రంజాన్ పండుగ రోజు ధనిక, పేద అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా నూతన దుస్తులు ధరిస్తారు. లాడ్‌బజార్, చార్మినార్, మదీనా, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టీ, శాలిబండ తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
రంజాన్ మాసం. పాతబస్తీలో ఏ గల్లీ చూసినా రద్దీ. అడుగడుగునా జనం. మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. చార్మినార్ ప్రధాన రోడ్డులో ఒక్కోసారి కాలినడక కూడా సాధ్యం కావడం లేదు. వినియోగదారులతో దుకాణాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రంజాన్ పండుగ రోజు ధనిక, పేద అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా నూతన దుస్తులు ధరిస్తారు. లాడ్‌బజార్, చార్మినార్, మదీనా, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టీ, శాలిబండ తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు…పాతబస్తీలో ఎటుచూసినా ప్రజల రద్ధీతో ఫుట్‌పాత్‌లు, దుకాణాలు కళకళలాడుతున్నాయి. మహిళలు పండుగను పురస్కరించుకుని రంగురంగుల గాజులను ఖరీదు చేస్తుండటంతో చార్మినార్‌లోని లాడ్‌బజార్ కిటకిటలాడుతోంది. 10 రూపాయలు మొదలుకుని 5 వేల రూపాయల విలువైన గాజులు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి గాజులను కొనుగోలు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిల్లూ స్క్వేర్‌లో సిద్దూ కాస్ట్యూమ్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో
Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమా చూసి తెగ సిగ్గుపడిపోయిన తాత
ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే ??