ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే ??
ఎక్కడపడితే అక్కడ.. ఎలా అంటే అలా కార్లు, బైకులు ఆపేయకూడదు మరి. అలా ఆపితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇటీవల రీల్స్ మోజులో పడి జనాలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడు. నగరంలో రద్దీగా ఉండే ఓ ఫ్లైఓవర్‌పై కారుని అడ్డంగా ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అతడికి ఏకంగా రూ.36,000 జరిమానా విధించారు.
ఎక్కడపడితే అక్కడ.. ఎలా అంటే అలా కార్లు, బైకులు ఆపేయకూడదు మరి. అలా ఆపితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇటీవల రీల్స్ మోజులో పడి జనాలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడు. నగరంలో రద్దీగా ఉండే ఓ ఫ్లైఓవర్‌పై కారుని అడ్డంగా ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అతడికి ఏకంగా రూ.36,000 జరిమానా విధించారు. నిందితుడి పేరు ప్రదీప్ ఢాకా అని, అతడు పోలీసులపై దాడికి కూడా యత్నించాడని పోలీసులు వివరించారు. నిందితుడు ప్రదీప్ కారుని స్వాధీనం చేసుకున్నామని, అతడిపై మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఢిల్లీ నగరం పశ్చిమ్ విహార్‌లోని ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో కారుని ఆపి వీడియోలు షూట్ చేశాడని, డోరు తెరిచి కారు నడిపాడని పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా పోలీసు బారికేడ్లకు నిప్పంటించి వీడియోలు తీశాడని వివరించారు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశాడని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బర్త్‌డే నాడు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి
Titanic: ‘టైటానిక్’ తలుపు చెక్కకు కళ్లు చెదిరే ధర
టిల్లు గాడు 50 కోట్లు.. అల్లకల్లోలంగా థియేటర్లు