Earthquake in Taiwan: తైవాన్‌లో భూకంపం భారీ విధ్వంసం, కుప్ప కూలిన భవనాలు.. జపాన్‌లో సునామీ హెచ్చరిక జారీ
తైవాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ 7.2 తీవ్రతను నమోదు చేయగా, US జియోలాజికల్ సర్వే 7.4గా పేర్కొంది. భూకంప కేంద్రం హువాలిన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలిన్‌లో భవనాల పునాదులు కదిలాయి. రాజధాని తైపీలో కూడా భూకంపం సంభవించింది. తైవాన్‌లో భూకంపం తర్వాత 3 మీటర్ల (9.8 అడుగులు) వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు అరగంట తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే మియాకో , యాయామా దీవుల తీరాలను తాకినట్లు తెలిపింది.
బుధవారం (ఈ రోజు) తెల్లవారుజామున తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ద్వీపం మొత్తం కంపించింది. భవనాలు కూలిపోయాయి. మరోవైపు జపాన్ దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. అక్కడ విమానాలు రద్దు చేయబడ్డాయి. ఫిలిప్పీన్స్ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాలను ఖాళీ చేయమని ఆదేశించింది. తైవాన్‌లో భూకంపం తర్వాత 3 మీటర్ల (9.8 అడుగులు) వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు అరగంట తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే మియాకో , యాయామా దీవుల తీరాలను తాకినట్లు తెలిపింది.
తైవాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ 7.2 తీవ్రతను నమోదు చేయగా, US జియోలాజికల్ సర్వే 7.4గా పేర్కొంది. భూకంప కేంద్రం హువాలిన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలిన్‌లో భవనాల పునాదులు కదిలాయి. రాజధాని తైపీలో కూడా భూకంపం సంభవించింది.
#WATCH | An earthquake with a magnitude of 7.2 hit Taipei, the capital of Taiwan.
(Source: Reuters) pic.twitter.com/SkHBHrluaZ
— ANI (@ANI) April 3, 2024
భూకంపం కారణంగా తైవాన్‌లోని హువాలిన్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. భారీ నష్టం జరిగింది. స్పీడ్ రైలు సర్వీసును నిలిపివేశారు. అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్ నుంచి జనం బయటకు వస్తున్నారు. తైవాన్‌లో 25 ఏళ్లలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీనిని అభివర్ణిస్తున్నారు.
全台有感,花蓮6級地震,陸陸續續傳出多棟建物倒塌。
天佑台灣。 pic.twitter.com/kIlJ2qRHEy
— 風暴士兵 🪐🪬Taiwan only (@dabowagaga) April 3, 2024
సునామీ హెచ్చరిక జారీ
యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం తైవాన్ తూర్పు తీరంలో బుధవారం 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా దక్షిణ జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పరిపాలన భూకంప కేంద్రం ప్రకారం.. భూకంప కేంద్రం హువాలిన్ కౌంటీ హాల్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 25.0 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో 15.5 కిలోమీటర్ల లోతులో ఉందని సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.
ఈశాన్య ప్రాంతంలోని యిలాన్ కౌంటీ, ఉత్తరాన మియాలీ కౌంటీలో 5+ తీవ్రత స్థాయి నమోదు అయింది. అయితే తైపీ సిటీ, న్యూ తైపీ సిటీ, టాయువాన్ సిటీ, ఉత్తరాన హ్సించు కౌంటీ, తైచుంగ్ సిటీలో 5+ తీవ్రత స్థాయి నమోదైంది.
సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి
భూకంపం కారణంగా తైపీ, తైచుంగ్ , కాహ్‌సియుంగ్‌లలో మెట్రో వ్యవస్థలు నిలిపివేయబడినట్లు CNA నివేదించింది. నైరుతి జపాన్‌లోని మియాకోజిమా, యాయామా ప్రాంతాల తీర ప్రాంతాలతో పాటు ఓకినావా ప్రిఫెక్చర్‌లోని ఒకినావా ప్రధాన ద్వీపానికి సునామీ హెచ్చరికను ప్రకటించారు. NHK నివేదిక ప్రకారం ఈ ప్రాంతాల నివాసితులు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..