Viral News: చిన్న వయసులోనే అమ్మమ్మ అయిన అమ్మాయి.. అసలేం జరిగిందో తెలుసుకుంటే షాక్, వైరల్ పిక్!
ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్ స్టా లాంటి సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తుంటాయి. ఆసక్తిరమైన విషయాలు తెలుసుకున్నప్పుడల్లా జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న షిర్లీ అనే మహిళ తాను అమ్మమ్మగా మారుతున్న విషయాన్ని బహిరంగంగా షేర్ చేసి హాట్ టాపిక్ గా మారింది.
ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్ స్టా లాంటి సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తుంటాయి. ఆసక్తిరమైన విషయాలు తెలుసుకున్నప్పుడల్లా జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న షిర్లీ అనే మహిళ తాను అమ్మమ్మగా మారుతున్న విషయాన్ని బహిరంగంగా షేర్ చేసి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంత చిన వయసులో అమ్మమ్మ అయినందుకు చాలామంది షాక్ అయ్యారు. అయితే దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది.
తల్లిదండ్రులుగా మారడం అనేది ఒక అందమైన అనుభవం అని మనందరికీ తెలుసు. కానీ తాతలు అవ్వడం కూడా మరింత ఆనందాన్ని ఇస్తుంది. కానీ సింగపూర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షిర్లీ ఈ విషయాన్ని అందరికీ వెల్లడించినప్పుడు, ఆ మహిళను అభినందించాలా లేదా ఓదార్చాలా అని అర్థం చేసుకోలేక నెటిజన్స్ చాలామంది ఆశ్చర్యపోయారు.
‘‘నా 17 ఏళ్ల కొడుకు తండ్రి అయ్యాడు. నేను అమ్మమ్మ అయ్యాను కాబట్టి మా కుటుంబం, నేను ఇటీవల ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం’’ అని మహిళ సోషల్ మీడియాలో తెలిపింది. ఇంకా అనేక విషయాలను రివీల్ చేస్తూ.. ‘‘నా కొడుకు ఇంత చిన్న వయసులో తండ్రి అయినందుకు కోపం లేదు. అతను చదువుతున్నాడు. నా కొడుక్కి ఆదాయ మార్గం లేదు. కాబట్టి అతనికి సాయం చేసేందుకు అండగా ఉంటున్నా. అటువంటి పరిస్థితిలో నేను నా కొడుకుకు ధైర్యం చెబుతున్నా. తద్వారా తన బాధ్యతలను బాగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ప్రపంచం అతనితో ఉన్నా, లేకపోయినా నేను ఎప్పుడూ అతనితోనే ఉంటాను’’ అని అంటోది ఈ అమ్మమ్మ.
షిర్లీ తన పోస్ట్‌లో రియాక్ట్ అవుతూ.. చిన్న వయస్సులో తల్లిదండ్రులుగా మారడం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను మూడు సార్లు వివాహం చేసుకున్నాను. ఐదుగురు పిల్లలను కలిగి ఉన్నాను. నేను 17 సంవత్సరాల వయస్సులో నా మొదటి బిడ్డకు జన్మనిచ్చా అని చెబుతుంది. అయితే షిర్లీ ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఇన్‌స్టాగ్రామ్‌లో 17 వేల మందికి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆమె రెస్టారెంట్ నడుపుతోంది.