సీఐఎస్‌ఎఫ్ క్వార్టర్‌లో ప్లాస్టిక్ సంచులు.. 3 బ్యాగుల్లో మహిళ శరీర భాగాలు.. అనేక పార్ట్స్ మిస్సింగ్
శరీర భాగాలతో కూడిన మూడు ప్లాస్టిక్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి నుదుటిపై కుంకుమ ఉంది. దీంతో ఆమెకు వివాహం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక బ్యాగ్ లోపల ఒక ఇటుక కూడా ఉంది. దీంతో బ్యాగ్ లో బరువు పెట్టి దూరంగా విసిరిన ప్రయత్నం జరిగిందని పోలీసులు భావిస్తున్నట్లు పోలీసులకు సహకరిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ విభాగానికి చెందిన దర్యాప్తు అధికారి తెలిపారు. శరీరంలోని చేతులు, కాళ్లు, పొత్తికడుపు భాగం ఇంకా కనిపించడం లేదని జాయింట్ సీపీ (క్రైమ్) సయ్యద్ వకర్ రజా ధృవీకరించారు.
భవనం నుంచి దుర్వాసన వస్తుందని కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్యాక్ చేసిన శరీర భాగాలను వెలికితీశారు. శరీరంలోని అనేక భాగాలు ఇంకా “తప్పిపోయినట్లు” పోలీసులు నిర్ధారించారు. స్థానికులు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దారుణ ఘటన కోల్ కతాలోని వాట్‌గుంగే ప్రాంతంలోని సస్థితలా రోడ్‌లోని ఉన్న పాడుబడిన సీఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్ చోటు చేసుకుంది. బాధితురాలు 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళ అని సీనియర్ అధికారులు నిర్ధారించారు. మంగళవారం సాయంత్రం నుంచి పోలీసులు ఆమె గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.
శరీర భాగాలతో కూడిన మూడు ప్లాస్టిక్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి నుదుటిపై కుంకుమ ఉంది. దీంతో ఆమెకు వివాహం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక బ్యాగ్ లోపల ఒక ఇటుక కూడా ఉంది. దీంతో బ్యాగ్ లో బరువు పెట్టి దూరంగా విసిరిన ప్రయత్నం జరిగిందని పోలీసులు భావిస్తున్నట్లు పోలీసులకు సహకరిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ విభాగానికి చెందిన దర్యాప్తు అధికారి తెలిపారు. శరీరంలోని చేతులు, కాళ్లు, పొత్తికడుపు భాగం ఇంకా కనిపించడం లేదని జాయింట్ సీపీ (క్రైమ్) సయ్యద్ వకర్ రజా ధృవీకరించారు.
“ఎవరో కదులుతున్న వాహనంలోంచి హడావుడిగా ప్లాస్టిక్ సంచులను విసిరినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఆ ఏకాంత ప్రదేశంలో హత్య చేశారా లేక మరెక్కడైనా హత్య చేసి, ఆ తర్వాత ఆమె శరీర భాగాలను నరికి ఇక్కడ పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై వాట్‌గుంగే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పాడుబడిన ప్రాంతంలో కబుర్లు చెప్పుకోవడానికి కొందరు యువకులు బృందంగా చేరుకున్నాడు. అక్కడ మధ్యాహ్నం 2.50 గంటలకు వస్తున్న దుర్వాసనతో బ్యాగులను గుర్తించి వెంటనే పోలీసు స్టేషన్‌కు పరుగెత్తారు. బ్యాగ్‌లలో శరీర భాగాలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ మూడు నల్లటి పాలిథిన్ బ్యాగులు ఉన్నాయి. మహిళ ఎవరు అనేది ఇంకా తెలియలేదు.. ఆమె వయస్సు 30-35 ఏళ్లు ఉంటుందని డీసీ (పోర్ట్) హరికృష్ణ పాయ్ తెలిపారు. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. కుక్కలను రంగంలోకి దింపారు. అయితే ఈ హత్య “ప్రతీకార హత్యగా భావిస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు. అంతేకాదు ఈ ప్రాంతం ఎక్కువగా వాడుకలో ఉంది కాదు. కనుక ఈ స్థలం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు అని ఒక అధికారి చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..