Tuesday Puja Tips: మంగళవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. హనుమంతుడి అనుగ్రహం మీ సొంతం..
హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది మంగళవారం సంకట మోచన హనుమంతుని ఆరాధనకు అంకితం చేయబడింది. బజరంగబలిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని.. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. మంగళవారం రోజున ఉపవాసం ఉండి బజరంగబలిని పూజిస్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఈ రోజున కొన్ని పనులు చేయడం వలన ఆంజనేయస్వామి అనుగ్రహం మీ సొంతం.

హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది మంగళవారం సంకట మోచన హనుమంతుని ఆరాధనకు అంకితం చేయబడింది. బజరంగబలిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని.. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. మంగళవారం రోజున ఉపవాసం ఉండి బజరంగబలిని పూజిస్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఈ రోజున కొన్ని పనులు చేయడం వలన ఆంజనేయస్వామి అనుగ్రహం మీ సొంతం.
రామ భక్త హనుమంతుడు ప్రేమ, భక్తి, నియంత్రణ, బలం , పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపం. తన ‘ప్రభువు’ కోసం ఏదైనా చేసే హనుమంతుడు తన భక్తుల మాటలను శ్రద్ధగా కూడా వింటాడు. జీవితంలో కష్ట సమయాల్లో సహాయం చేసే రాముడి గొప్ప భక్తుడు ఆయన. హనుమంతుడిని పూజించడానికి మంగళవారం, శనివారం ఉత్తమ రోజులుగా నమ్ముతారు. హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి మంగళవారం ఏ పరిహారాలు చేయడం ఫలవంతమో ఈ రోజు తెలుసుకుందాం..
రామ నామ జపం: ఎక్కడ రామ నామం జపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని తరచుగా చెబుతారు. ఆయన రాముని గొప్ప భక్తుడు. తనకంటే ముందు రాముడుకి నైవేద్యాన్ని సమర్పించాలని .. లేదంటే ఏ నైవేద్యాన్ని హనుమంతుడు స్వీకరించడని విశ్వాసం. కనుక ప్రతి మంగళవారం రామ నామ జపం చేయడం ద్వారా హనుమంతుని ఆశీర్వాదాలను పొందవచ్చు. ఉదయాన్నే మేల్కొని స్నానమాచరించిన అనంతరం మీకు తెలిసిన ఏ రూపంలోనైనా రాముని నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించండి.
హనుమాన్ చాలీసా పారాయణం: హనుమంతుడి స్వభావం, సద్గుణాలు, విజయాలను తెలియజేసే 40 శ్లోకాలు గల హనుమాన్ చాలీసాను ప్రతి మంగళవారం పటించడం శుభప్రదం అని నమ్మకం.
కోతులకు ఆహారం: హనుమంతుడి వానరుడు. కనుక వానర సేన అయిన కోతులకు మంగళవారం ఆహారం పెట్టడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ప్రజలు సాధారణంగా కోతులకు అరటిపండ్లు లేదా ఆపిల్ల వంటి పండ్లు లేదా బెల్లం కూడా పెట్టవచ్చు.
శనగలు: మంగళవారం హనుమంతుడి ప్రసాదంగా శనగలు పంపిణీ చేయండి. హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం ఈ శనగలను ఇతర భక్తులకు ప్రసాదంగా అందించడం హనుమంతుడి ఆశీర్వాదాలు పొందడానికి మంచి మార్గమని చెబుతారు. హనుమంతుడికి శనగలు సమర్పించడం అనేది పాలక గ్రహం అయిన కుజుడిని శాంతింపజేయడానికి ఒక మార్గమని చాలామంది నమ్ముతారు.
బ్రహ్మచర్యాన్నిపాటించండి: హనుమంతుడిని బ్రహ్మచారి అని పిలుస్తారు. ఆయన క్రమశిక్షణ, స్వచ్ఛత ,స్వీయ నియంత్రణతో కూడిన జీవితాన్ని కొనసాగించాడు, అందువల్ల మంగళవారం రోజున మాత్రమే కాకుండా, సాధారణంగా హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మచర్యాన్ని పాటించడం ముఖ్యమని చెబుతారు. అతిగా తినడం, ఇతరుల గురించి చెడుగా చెప్పడం, అధిక కామం, దురాశ లేదా కోపం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.
అవసరంలో ఉన్నవారికి సహాయం: హనుమంతుడు రామ లక్ష్మణుల కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధ పడ్డాడు. సీతాదేవి జాడ కోసం సముద్రాన్ని దాటి, పర్వతాలను అధిరోహించాడు. తన జీవితమంతా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా రాముడికి సేవ చేశాడు. అదే విధంగా మంగళవారం లేదా సాధారణంగా ఏ రోజునైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయండి, ఆహారం, బట్టలు లేదా డబ్బును దానం చేయండి లేదా మూగ జీవులకు సేవ చేయండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








