TTD Temple: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి..
TTD Temple: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అంగప్రదిక్షణానికి అనుమతించింది. దీనికి సంబంధించిన టోకెటన్లను..
TTD Temple: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అంగప్రదిక్షణానికి అనుమతించింది. దీనికి సంబంధించిన టోకెటన్లను ఏప్రిల్ 1వ తేదీన జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్ల జారీని నిలిపివేసింది టీటీడీ. ప్రస్తుత కోవిడ్ 19 వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో.. అంగప్రదక్షణ టోకెన్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అలాగే ఆఫ్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానాన్ని కూడా పునరుద్ధరించనున్నట్లు తెలిపింది. తిరుమలలోని సీఆర్వోలో ఆర్జిత సేవలు నమోదు చేసుకున్న వారికి ఈ లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్‌లో ఆర్జిత సేవలను భక్తులకు కేటాయించింది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణక్ష్ంతో ఏప్రిల్‌లో శ్రీవారి దర్శనాల సంఖ్య మరింత పెరుగనున్నాయి. ఇప్పటికే రోజుకు 60 నుంచి 70 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తోంది టీటీడీ. కాగా, కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు నిలిపివేసిన అంగప్రదక్షిణ టోకెన్ల పునరుద్ధరణ, ఆఫ్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానాన్ని కూడా పునరుద్ధరించనున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Also read:
Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పాము దాగుంది.. అదెక్కడుందో కనిపెడితే మీరే జీనియస్.!