TTD News: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై వెంకన్నను ఎలాంటి ఆంక్షలు లేకుండా దర్శించుకునే అవకాశం..

TTD News: కరోనా (Corona) ప్రభావం కలియుగ దైవం తిరుమల శ్రీవారిపై కూడా పడిన విషయం తెలిసిందే. కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ (TTD) అధికారులు ఆంక్షలు విధించారు. మొదట్లో భక్తులకు పూర్తిగా..

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై వెంకన్నను ఎలాంటి ఆంక్షలు లేకుండా దర్శించుకునే అవకాశం..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 07, 2022 | 11:40 AM

TTD News: కరోనా (Corona) ప్రభావం కలియుగ దైవం తిరుమల శ్రీవారిపై కూడా పడిన విషయం తెలిసిందే. కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ (TTD) అధికారులు ఆంక్షలు విధించారు. మొదట్లో భక్తులకు పూర్తిగా దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ వచ్చారు. అనంతరం కేవలం పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తూ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తూ వచ్చారు.

అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుడండంతో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత కొవిడ్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి శ్రీవారిని సాఫీ దర్శించుకునే చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఆదివారం చెన్నైలోని టీటీడీ స్థానిక సలహా మండలి సభ్యుల పదవీ ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘త్వరలోనే ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తాం. నెల రోజుల్లో సాధారణమైన దర్శన ప్రక్రియ మొదలవుతుంది. సర్వదర్శనం అందుబాటులోకి తీసుకొస్తాం. తమిళనాడు, పుదుచ్చేరి నుంచి కాలినడకన వస్తున్న భక్తుల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటున్నాం. చెన్నైలో ఆలయ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమవుతాం. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో రెండుచోట్ల భూములిచ్చింది’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ ఔటైన విధానం షాకింగ్‌గా ఉంది.. ప్రస్తుతం అతను సరిగాలేడు.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Attack on Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన.. ఇవాళ ఉభయసభల్లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన

Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం.. ఘనంగా ఆరవరోజు కార్యక్రమాలు.. (లైవ్ వీడియో)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?