Tirumala: కళియుగ దైవం వేంకటేశ్వరుడి దగ్గరకు రాలేని వారికి టీటీడీ గుడ్ న్యూస్..!
గోవిందా అంటూ నామస్మరణ సాగిస్తే చాలు, శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పలు రాష్ట్రాలలో ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయాలు ఉన్నాయి. ప్రతిసారీ తిరుమలకు రాలేని భక్తులు, ఆ ఆలయాలను దర్శించి శ్రీనివాసుడి ఆశీస్సులు అందుకుంటారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

కళియుగ దైవం వేంకటేశ్వరుడి దగ్గరకు రాలేని వారికి గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. తమ నిర్ణయాన్ని అమలుచేసేందుకు దేశవ్యాప్తంగా అయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు టీటీడీ చైర్మన్ లేఖ రాశారు. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని 14 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని కోరారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. సమాజ అభివృద్ధికి దోహదపడతాయి. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలని లేఖలో వివరించారు. కోట్లాది మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలకు విరాళాలు ఇస్తున్నారు. వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయంటూ టీటీడీ ఛైర్మన్ లేఖలో పేర్కొన్నారు.
గోవిందా అంటూ నామస్మరణ సాగిస్తే చాలు, శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పలు రాష్ట్రాలలో ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయాలు ఉన్నాయి. ప్రతిసారీ తిరుమలకు రాలేని భక్తులు, ఆ ఆలయాలను దర్శించి శ్రీనివాసుడి ఆశీస్సులు అందుకుంటారు. అందుకే ప్రతీ రాష్ట్ర రాజధానిలో టెంపుల్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఉచితంగా స్థలం కేటాయించాలని సీఎంలను కోరారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




