AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: మీ వివాహ మొదటి శుభలేఖ తిరుమల వెంకన్నకు ఇలా పంపించండి.. పెండ్లికానుక అందుకోండి

Tirumala: తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో విఘ్నేశ్వరుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. ఇక వివాహం జరిగే ఇంట్లోని

Tirumala: మీ వివాహ మొదటి శుభలేఖ తిరుమల వెంకన్నకు ఇలా పంపించండి.. పెండ్లికానుక అందుకోండి
Tirumala
Surya Kala
|

Updated on: Jun 12, 2021 | 10:22 AM

Share

Tirumala: తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో విఘ్నేశ్వరుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. ఇక వివాహం జరిగే ఇంట్లోని మొదటి శుభలేఖ దేవుడి గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి అప్పుడు బంధువులకు, స్నేహితులకు పంచడం మొదలు పెడతారు. అయితే చాలా మంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని భావిస్తారు.తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖ ను ఇస్తారు. మరి దూరపు భక్తులపై స్వామివారికి శుభలేఖను ఎలా పంపించేలా అని ఆలోచిస్తారు.. ఎవరైనా తెలిసిన భక్తులు తిరుమల వెళ్తే.. వారి చేతికి ఇస్తారు.. అటువంటి అవకాశం లేని భక్తులు కూడా స్వామివారికి వివాహ ఆహ్వాన పత్రిక పంపవచ్చు ఏది ఎలా అంటే..

మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపించవచ్చు వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలుపుతారు)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..

తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్ చేయాల్సిన అడ్రస్ ఏమిటంటే..

To, Sri Lord Venkateswara swamy, The Executive Officer TTD Administrative Building K.T.Road Tirupati

Also Read: శివుడు బ్రహ్మహత్యా దోషాన్ని స్నానమాచరించి పోగొట్టుకున్న పవిత్ర క్షేత్రం ఎక్కడో తెలుసా