Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. టికెట్లు ఉండి ఆ తేదీల్లో దర్శనానికి వెళ్లని భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..

Tirupati: తిరుమల, తిరుపతిలో గత మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు జనజీవనం అస్త్యవ్యస్తమైంది.  శ్రీవారి భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి..

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. టికెట్లు ఉండి ఆ తేదీల్లో దర్శనానికి వెళ్లని భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..
Tirumala Rains
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 22, 2021 | 12:24 PM

Tirupati: తిరుమల, తిరుపతిలో గత మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు జనజీవనం అస్త్యవ్యస్తమైంది.  శ్రీవారి భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందిస్తూ.. తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయన్నారు. ఈ వర్షాల వలన తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలిగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారని సుబ్బారెడ్డి చెప్పారు. అంతేకాదు రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు.  ఈ ఘాట్ రోడ్డులో కూడా టీటీడీ సిబ్బంది కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారని చెప్పారు. తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయన్నారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడ తో పాటు, రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్,  శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నట్లు ఆయన తెలిపారు. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారని చైర్మన్ వివరించారు.

శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారన్నారు.

వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారని ఆయన చెప్పారు.  స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామన్నారు.

టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని  సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

Also Read: కొడుకు వైద్యం కోసం సెలవు అడిగితే లంచం అడిగిన అధికారి.. పిల్లలని అమ్మకానికి పెట్టిన ఉద్యోగి.. ఎక్కడంటే