Weekly Horoscope: ఈ వారం వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది.. నవంబర్ 21 నుంచి 27వరకూ రాశిఫలాలు

Weekly Horoscope: ఏ పని మొదలు పెట్టాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. తమ జాతకాలను నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాలను..

Weekly Horoscope: ఈ వారం వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది.. నవంబర్ 21 నుంచి 27వరకూ రాశిఫలాలు
Weekly Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2021 | 10:51 AM

Weekly Horoscope: ఏ పని మొదలు పెట్టాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. తమ జాతకాలను నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాలను చూస్తారు. ఈరోజు 21వ తేదీ నవంబర్ నుంచి 27వ తేదీ నవంబర్ వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ వారంలో ఈ రాశివారు ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తి చేస్తారు. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులను సాధిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

వృషభ రాశి:  చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు, బంధువులు సహకారం లభిస్తుంది. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు కలుగుతాయి. వాహనం, భూమి కొనుగోలు చేస్తారు. రావలసిన బాకీలు వసూలు అవుతాయి.. ఆదాయం స్థిరంగా ఉండి.. క్రమేపీ పెరుగుతుంది.

మిథున రాశి: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార రంగంలో లాభాలు కలుగుతాయి. ఆర్ధికంగా సంతృప్తికరంగా సాగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో కుటుంబంలో సంతోషంగా ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్థి తగాదాలు పరిష్కారమవుతాయి. కొత్త పరిచయాలతో  పనులు సులభంగా చేస్తారు.

కర్కాటక రాశి:  ఈ రాశి వారు ఈ వారంలో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంగలో ఉన్నవారు లాభాలను పొందుతారు. కొత్త పరిచయాల వలన చేపట్టిన పనులు నెరవేర్చుకుంటారు. వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. డబ్బుల విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. వాహనాల వలన ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి: ఈ వారంలో చేపట్టిన పనులు నెరవేరతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. రావాలిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంతో సంతోషముగా గడుపుతారు. స్థిర నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి. ఆరోగ్యంగా ఉంటారు. పారిశ్రామిక వేత్తలు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. రావాలిన డబ్బు చేతికి అందుతుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ చేపట్టాలనుకునేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఖర్చులు ఏర్పడవచ్చు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగస్థుల్లో బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దవారి సలహాలతో చేపట్టిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు.

తుల రాశి: వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. రావాల్సిన డబ్బులు ఆలస్యంగా అందుతాయి. ఉన్నత విద్య ప్రయత్నాలు నెరవేరతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో కాలయాపన జరగవచ్చు.  విద్యార్థులు చదువులో రాణించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవచ్చు. వ్యవసాయాదారులకు లాభసాటిగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈ రాశివారికి ఈ వారం ఆదాయం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఫ్యామిలీతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయం బేధాలు ఏర్పడే అవకాశం ఉంది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్క్రమవుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి: ఈ రాశివారు ఈ వారంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. రావాలిన డబ్బులు చేతికి ఆలస్యంగా అందుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన పనులు జరగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. అధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు భాగస్వాములతో అవగాహనతో నడుచుకుంటారు. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి: రాశివారు ఈ వారంలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపార వేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆస్థి వివాదాలు తీరే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. బంధు మిత్రుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.   తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.  ఆఖిరి నిమిషంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మొత్తానికి ఈ రాశివారికి ఈ వారం లాభిస్తుంది.

కుంభ రాశి: ఈరాశి వారి ఈ వారంలో కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడతాయి. దీంతో పనులను వాయిదా వేస్తారు. ప్రయాణాలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగం రంగంలో సంతృప్తికరంగా ఉంటుంది. పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు వసూలు అవుతాయి. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి.

మీన రాశి: ఈ వారం ఈ రాశివారు భూమి తగాదాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  బంధుమిత్రులల్తో అభిప్రాయం బేధాలు ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్తలు తీసుకోవాలి. అలసట లేకుండా పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేయాలి. ఏ పనులు మొదలు పెట్టినా కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరమైన ఆలోచనకు దూరంగా ఉండడం మంచిది.

Also Read :  సీఎం జగన్ ఉన్న ప్లెక్సీని చింపిన టీడీపీ నేతలు.. ఏడుగురిపై కేసు నమోదు..

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..