AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: భక్తులతో కిటకిటలాడుతోన్న తిరుమల కొండలు.. వారం రోజుల్లో హుండీ ఆదాయం ఎంతంటే..!

తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగానే టీటీడీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 23 నుంచి 29 వరకు వారం రోజుల్లో 5.78 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించింది. రూ. పాతిక కోట్ల హుండీ ఆదాయాన్ని పొందింది.

Tirumala: భక్తులతో కిటకిటలాడుతోన్న తిరుమల కొండలు.. వారం రోజుల్లో హుండీ ఆదాయం ఎంతంటే..!
Tirumala
Raju M P R
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 30, 2025 | 12:35 PM

Share

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుమల పోటెత్తుతోంది. వేసవి సెలవులు తోపాటు వాతావరణం అనుకూలించడంతో తిరుమల భక్తకోటిని ఆకట్టుకొంటోంది. గత వారం రోజులుగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పోటెత్తిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే టీటీడీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ తోపాటు శ్రీవారి సేవకులు ద్వారా విశేష సేవలు అందిస్తోంది. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణ గిరి షెడ్లుతోపాటు రోజు కిలో మీటర్ల కొద్దీ బయట ఉన్న క్యూలైన్లలోని భక్తులకు టీటీడీ యంత్రాంగం ఏ లోటూ రాకుండా సేవలు అందించింది. ఈ నెలలో ఇప్పటి దాకా 29 రోజుల్లో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు ఇతర అన్న ప్రసాద కేంద్రాల్లో కలిపి దాదాపు 60 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలను, అల్పాహారాలను శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందించింది. క్యూలైన్ల ను సమర్థవంతంగా నిర్వహించింది.

ఈ నెల 23 న 72,579 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 24 న 74,374 మంది, 25 న 90,221 మంది, 26 న 91,538 మంది, 27 న 83,542 మంది, 28 న 82,597 మంది, 29 న 83,621 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా వారం రోజుల్లో 5,78,462 మంది భక్తులకు టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. రోజు సగటున 82 వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోగా టీటీడీకి వారం రోజుల్లో రూ 25.53 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇక వారం రోజుల్లో 2,50,742 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా వారం రోజులుగా తిరుమల కొండ భక్తుల కిటకిటలాడుతోంది. మరోవైపు నిరంతర పర్యవేక్షణతో క్యూ లైన్ లోని భక్తులకు టీటీడీ యంత్రాంగం విస్తృత సేవలను అందించింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..