Tirupati: కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు.. ఈ వాహన సేవ దర్శన విశిష్టత ఏమిటంటే..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా స్వామివారి వైభవం ఉంటుంది. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజు ఇవాళ ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనసేవ జరిగింది.