Vastu Tips: బాత్‌రూమ్ విషయంలో ఈ పొరపాట్లు చేశారా.? వెంటనే అలర్ట్ అవ్వండి..
ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం బాగుండాలంటే బాత్ రూమ్ కచ్చితంగా సరైన వాస్తుతో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బాత్‌రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయం లేదా నైరుతి దిశలో ఉండకూడదని చెబుతున్నారు. ఒకవేళ ఈ దిశలో బాత్‌రూమ్ ఉంటే ఇంట్లో ఉండే వారు తరచుగా అనారోగ్యం బారిన పడే అవకాశాలుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు...
ఇంటి వాస్తు.. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు అన్నింటిపై వాస్తు ప్రభావం తప్పకుండా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే వాస్తు ఫాలో కావాలని చెబుతుంటారు. ఇంటి నిర్మాణం చేపట్టే ముందు వాస్తు నిపుణుల సలహాలను తీసుకుంటారు. వాస్తు శాస్త్రం ఆధారంగానే కిచెన్, బాత్ రూమ్, బెడ్ రూమ్‌లు ఎక్కడెక్కడ ఉండాలో డిజైన్ చేసుకుంటారు.
అయితే ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం బాగుండాలంటే బాత్ రూమ్ కచ్చితంగా సరైన వాస్తుతో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బాత్‌రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయం లేదా నైరుతి దిశలో ఉండకూడదని చెబుతున్నారు. ఒకవేళ ఈ దిశలో బాత్‌రూమ్ ఉంటే ఇంట్లో ఉండే వారు తరచుగా అనారోగ్యం బారిన పడే అవకాశాలుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక దక్షిణ దిశను అగ్ని దిశగా పరిగణిస్తారు. అందుకే ఈ దిక్కులో ఎట్టి పరిస్థితుల్లో నీటితో నిండిన బకెట్ కానీ, నీటి కుళాయి కానీ ఉండకూదు. ఉత్తరంలో ట్యాప్ లేదా షవర్ ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూమ్‌లో అద్దం పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అద్దం శక్తిని ప్రతిబింబిస్తుంది. బాత్రూమ్‌లో ప్రతికూల శక్తి ఉంటుందని, అద్దం ఉంటే ఈ శక్తి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఇంటి మెయిన్ గెయిట్ ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో బాత్ రూమ్ ఉండకూడదు, అలాగే వంట గదికి ఎదురుగా కూడా బాత్‌రూమ్ నిర్మించకూడదు. బాత్రూమ్‌లో ఏర్పాటు చేసే టాయిలెట్ సీటు పశ్చిమం లేదా వాయువ్య దిశలో ఉండాలి.
ఈశాన్యం అదే విధంగా తూర్పు దిశలో బాత్రూమ్‌ను ఎప్పుడూ నిర్మించకూడదు. ఇక బాత్‌రూమ్‌లో ఏర్పాటు చేసే గ్రీజర్, స్విచ్ బోర్డ్ వంటివి ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక బాత్ టబ్ విషయానికొస్తే తూర్పు లేదా ఈశాన్యంలో దిశలో ఏర్పాటు చేయకూడదు. మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..