AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thursday Puja Tips: పనుల్లో ఆటంకాలా, ఆర్ధిక ఇబ్బందులా.. గురువారం ఈ పరిహారాలు చేయండి.. శుభ ఫలితాలు మీ సొంతం..

హిందూ మతంలో వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. గురువారం విష్ణువు ఆరాధనకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున నియమ నిష్టల ప్రకారం శ్రీ హరిని పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ రోజు గురువారం చేయాల్సిన పూజకు సంబంధించిన ప్రత్యేక పరిహారాలను గురించి తెలుసుకుందాం.

Thursday Puja Tips: పనుల్లో ఆటంకాలా, ఆర్ధిక ఇబ్బందులా.. గురువారం ఈ పరిహారాలు చేయండి.. శుభ ఫలితాలు మీ సొంతం..
Thursday Puja Tips
Surya Kala
|

Updated on: Apr 17, 2025 | 6:22 AM

Share

హిందూ మతంలో గురువారం విష్ణువుకు, నవ గ్రహాల్లో బృహస్పతి కి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణువుని పూజించడం అత్యంత ఫలవంతమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువును పూజించడం ద్వారా ఒక వ్యక్తికి ఆనందం, శ్రేయస్సు, ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. గురువారం ఉపవాసం ఉండటం వల్ల భక్తుడి కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో విజయానికి ఆటంకాలు ఎదురవుతున్న వారు లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా పురోగతికి ఆటంకాలు ఎదురవుతున్న వారు గురువారం విష్ణువు, బృహస్పతిని పూజించాలి. నారాయణుడిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుందని .. మీకు సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. గురువారం పూజ విధానం, విష్ణువు అనుగ్రహం కోసం చేయాల్సిన దోషరహిత పరిహారాలు, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

  1. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు. కనుక గురువారం తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తులసి లేని శ్రీ హరి పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కనుక గురువారం రోజున శ్రీ విష్ణువును పూజించే సమయంలో తులసి దళాలను సమర్పించండి.
  2. ఏదైనా దేవుడిని లేదా దేవతను పూజించేటప్పుడు మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి.. గురువారం రోజున తులసి మాలతో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వలన శ్రీ మహా విష్ణువు త్వరగా అనుగ్రహిస్తాడని నమ్ముతారు.
  3. ఎవరైనా వివాహంలో పదే పదే అడ్డంకులను ఎదుర్కొంటుంటే.. లేదా సంబంధం స్థిరపడిన తర్వాత చెడిపోతుందంటే గురువారం రోజున విష్ణువును పూజించాలి. ఈ రోజున ఉపవాసం ఉండాలి. ఈ రోజున విష్ణువు లేదా వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి ఆయనకు పసుపు పువ్వులు, పసుపు మిఠాయిలు సమర్పించండి. ఇలా చేయడం వలన భక్తుడి సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
  4. గురువారం రోజున రావి చెట్టు, అరటి చెట్టు, తులసి మొక్కను పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల భక్తుడికి ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తీరతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావు.
  5. ఇవి కూడా చదవండి
  6. వీలైతే గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి. అంతేకాదు పూజ చేసే సమయంలో పసుపు రంగు ఆసనం మీద కూర్చోండి. ఈ పరిహారాలను చేయడం వలన భక్తుల జీవితంలో దేనికీ కొరత ఉండదని.. జీవితంలో సమస్యలు ఎదురవ్వవని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్