AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra 2025: ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా

చార్ ధామ్‌ యాత్రకు సమయం ఆసన్నం అవుతోంది. ఈ యాత్రలో నాలుగు తీర్ధ క్షేత్రాల తలుపులు ఒకొక్కటిగా తెరవనున్నారు. కేదార్‌నాథ్ ధామ్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు 2 మే 2025న భక్తుల కోసం తెరవబడతాయి. చార్ ధామ్‌కు ప్రయాణం 6 నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ నాలుగు దేవాలయాల తలుపులు మూసివేయబడతాయి.

Char Dham Yatra 2025: ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
Kedarnath Doli Yatra
Surya Kala
|

Updated on: Apr 17, 2025 | 7:36 AM

Share

చార్ ధామ్ యాత్ర హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత కలిగినది యాత్రగా పరిగణించబడుతుంది. చార్ ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్ లను సందర్శిస్తారు. ప్రతి శివ భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్‌ను సందర్శించాలని కోరుకుంటాడు. కేదార్‌నాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కేదార్నాధుడిని దర్శించుకునేందుకు వెళ్తారు. కేదార్నాధుడి దర్శించనంతోనే భక్తుల దుఃఖాలన్నీ తొలగిపోతాయని మత విశ్వాసం. కేదార్‌నాథ్ ధామ్‌కు వచ్చే భక్తులపై భోలాశంకరుడు ప్రత్యేక ఆశీస్సులు కురిపిస్తాడని, భక్తుల కోరికలను తీరుస్తాడని నమ్ముతారు.

కేదార్‌నాథ్ ఆలయం డోలి ఉత్సవంతో ముడిపడి ఉన్న సంప్రదాయం

ఈ సంవత్సరం కేదార్‌నాథ్ తలుపులు 2 మే 2025న తెరుచుకుంటాయి. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచే ముందు అనేక సంప్రదాయాలను పాటిస్తారు. ఆలయ తలుపులు తెరిచే ముందు, బాబా భైరవనాథ్‌ను పూజిస్తారు. తర్వాత కేదార్‌నాథ్ బాబా పంచముఖి డోలీని ఉఖిమఠ్ నుంచి కేదార్‌నాథ్ ధామ్‌కు తీసుకువెళతారు. మరుసటి రోజు కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఆచారాల ప్రకారం భక్తుల కోసం తెరవబడతాయి.

కేదార్‌నాథ్ పంచముఖి డోలి

కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేసినప్పుడు.. కేదార్నాధుడి విగ్రహం 6 నెలల పాటు గడ్డి స్థల్ ఓంకారేశ్వర్ ఆలయం ఉఖిమత్‌లో ఉంచబడుతుంది. కేదార్‌నాథ్ పల్లకీకి ఐదు ముఖాలు ఉన్నాయి. అందుకే దీనిని పంచముఖి డోలి అని పిలుస్తారు. ఈ పల్లకీలో బాబా కేదార్‌నాథ్ భోగ వెండి విగ్రహం ఉంచబడింది.

ఇవి కూడా చదవండి

బాబా కేదార్‌నాథ్ విగ్రహాన్ని ఈ పంచముఖి డోలిలో దాని శీతాకాలపు స్థానం అయిన ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకువస్తారు. తరువాత కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే సమయంలో.. బాబా కేదార్నాధుడి భోగ విగ్రహాన్ని అదే డోలిలో కేదార్‌నాథ్ ఆలయానికి తీసుకువెళతారు. ఈ విగ్రహాన్ని కేదార్‌నాథ్ ధామ్‌లో ఆరు నెలలు.. తర్వాత దాని శీతాకాలపు స్థానం అయిన ఓంకారేశ్వర్ ఆలయంలో ఆరు నెలలు పూజిస్తారు.

చార్ ధామ్ యాత్ర 2025 ఎప్పుడంటే

ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి ద్వారాలు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు 2 మే 2025న అనంతరం బద్రీనాథ్ తలుపులు 4 మే 2025న తెరుచుకుంటాయి.

ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ నాలుగు ధామ్‌లను సందర్శించడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటాము. నాలుగు ధామాలలో ముందుగా యమునోత్రి ఆలయాన్ని, తరువాత గంగోత్రిని సందర్శిస్తారు. దీని తరువాత కేదార్‌నాథ్ ధామ్.. ఛార్ ధామ్ యాత్రలో చివరకు బద్రీనాథ్‌ను సందర్శిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్