Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏది జరిగినా మన మంచికే.. ధైర్యంగా ఉండాలని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు

భగవద్గీత అనేది శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన విలువైన బోధ. ఈ గ్రంథం కేవలం యుద్ధరంగంలో జరిగిన సంభాషణ కాదు. ఇది మానవ జీవితం ఎదుర్కొనే సందేహాలకు సమాధానం. ఇందులో కర్మ, ధర్మం, జ్ఞానం, భక్తి గురించి లోతుగా చెప్పబడింది. శ్రీ కృష్ణుడు చెప్పిన మాటలు మన జీవితాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రేరణనిస్తాయి.

ఏది జరిగినా మన మంచికే.. ధైర్యంగా ఉండాలని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు
Bhagavad Gita Teachings
Follow us
Prashanthi V

|

Updated on: Apr 16, 2025 | 5:27 PM

శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టే.. ప్రతి ఒక్కరు తన జీవితంలో చేయాల్సిన పనిని చేయాలి. చేసే పని వల్ల ఏం వస్తుందో అని ఎక్కువగా ఆలోచించకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లూ.. దాని ఫలితం గురించి నువ్వు బాధపడకు అని శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు. మనం ఏ పని చేసినా నమ్మకంతో చేయాలని ఆ శ్రీకృష్ణుడు స్పష్టంగా బోధించాడు.

శ్రీ కృష్ణుడు ఇంకా ఏం చెబుతున్నాడో తెలుసా..? ఏదైతే జరుగుతుందో అది మన మంచికే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా మంచికే అనుకోవాలి. ముందు ముందు జరగబోయేది కూడా మన మంచి కోసమే. ఈ మాటలు మనకు ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలని, భయపడకూడదని సూచిస్తున్నాయి.

మనిషి తన నమ్మకాన్ని బట్టే తయారవుతాడు. తాను ఏదైతే గట్టిగా నమ్ముతాడో దానిలాగానే తయారవుతాడు. అంటే మనం ఏం నమ్ముతామో.. అదే మన మాటల్లో, చేష్టల్లో కనిపిస్తుంది. మన మనసు ఏ వైపు వెళ్తే మన జీవితం కూడా అదే దిశగా ముందుకు సాగుతుంది.

నీ విధిని అనుసరించు.. ఎందుకంటే పని చేయడం నీ హక్కు. అంటే మనం మన బాధ్యతను నిజాయితీగా పూర్తి చేయాలి. మనం చేసే ప్రతి పని మన లక్ష్యం చేరేందుకు తోడ్పడుతుంది. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధగా, ఓర్పుతో చేయాలి.

శ్రీ కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు.. కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది. అప్పుడు మనం ఏది చేయాలో, ఏది చేయకూడదో అర్థం కాకుండా పోతుంది. అంతేకాదు కోపం వల్ల మన బుద్ధి కూడా పని చేయదు. కోపం వల్ల మనం తప్పులు చేస్తాం. మనసు స్థిరంగా ఉండకపోతే శాంతి పోతుంది.

యోగి అంటే తన కోరికలన్నింటిని వదిలేసి తన మనసులోనే సంతృప్తి చెందగలిగే వ్యక్తి అని శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు. అంటే మనం బయట భోగాలలో కాకుండా.. మన లోపలే ఆనందాన్ని అనుభవించాలి. మనసులో తృప్తిగా ఉండటం వల్లనే నిజమైన శాంతి లభిస్తుంది. అలాంటి తృప్తి కలిగినవారే నిజమైన యోగి.

మన మనసులో కోరికలు తక్కువగా ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మితే మనలో నిజమైన శాంతి ఏర్పడుతుంది. అంటే మన మనసు లోపలే శాంతి ఉంటుంది.. బయట కాదని శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు.

ఉత్తముడు అంటే ఎవరు.. ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఆహం చూపించకుండా.. బాధలో ఉన్నప్పుడు కూడా మొహమాటం లేకుండా ధైర్యంగా ఉండేవారు అంటారు శ్రీ కృష్ణుడు. ఏ పరిస్థితిలోనైనా మన మనసు ఆనందంలోనూ, బాధలోనూ సమంగా ఉంటుందో అతనే నిజమైన గుణవంతుడు అవుతాడు. సమభావంతో ఉండటం గొప్ప లక్షణం అంటారు శ్రీ కృష్ణుడు.

ఎవరు తన ఇంద్రియాల మీద నియంత్రణ పెడతారో వారు నిజంగా తెలివైనవారు. ఇంద్రియాలపై నియంత్రణ ఉంటే మనిషి జ్ఞానమంతుడవుతాడు. మనం భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడకుండా.. ఇప్పుడు మన ముందున్న పనిని నమ్మకంగా, శ్రద్ధగా చేయాలని చెబుతున్నారు శ్రీ కృష్ణుడు.