AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashada Masam 2023: ఆషాడంలో శుభకార్యాలు ఎందుకు జరుపుకోరు.. సైంటిఫిక్ రీజన్ ఇదే..

శుభకర్యాలకు అవకాశం లేకపోయినా.... ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న నెల ఆషాడం. తొలకరి జల్లులతో ప్రకృతి శోభనందించే ఆషాడమాసంలో ఎన్నో పర్వదినాలుంటాయి. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతి నెల ఓ ప్రత్యేకత ఉంటుంది.. ఆషాడ మాసానికి ఉన్న ప్రాధాన్యతపై tv9 స్పెషల్ స్టోరి.

Ashada Masam 2023: ఆషాడంలో శుభకార్యాలు ఎందుకు జరుపుకోరు.. సైంటిఫిక్ రీజన్ ఇదే..
Ashada Masam
Peddaprolu Jyothi
| Edited By: Sanjay Kasula|

Updated on: Jul 13, 2023 | 8:53 AM

Share

ఆషాడమాసం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆషాడ మాసం నెలలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఆషాడమాసంలో తెలంగాణలో బోనాలు సంబురాలు మొదలవుతాయి. ఆషాడశుద్ద పాడ్యమి నాడు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు. మహాభారతాన్ని రచించిన వ్యాసభగవానుడిని ఆరాధించే రోజే ఆషాఢ పౌర్ణమి దీన్నే గురుపౌర్ణమి అంటారు. ఇలా ఆషాడమాసం ఎన్నో పర్వదినాలను తీసుకువస్తుంది. ఆషాఢమాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, శంకుస్ధాపనలు.. ఇలాంటి శుభకార్యాలేవి చేయరు అందుకే శూన్యమాసం అని కూడా అంటారు.ఆషాడ మాసం నెలలో వివాహాది శుభకార్యాలు ఏమి చేయరు. తెలంగాణలో అయితే గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకెళ్ళి అమ్మవారికి ఆర్పించి బోనాలు సమర్పింస్తారు.

తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో కొత్త ఏడాది ప్రారంభమై…ఫాల్గుణి మాసంతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే నాలుగో నెలలో ఆషాడం మాసం వస్తుంది. ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కలువకుండా జాగ్రత్త పడుతారు. నూతన వధువును పుట్టింటికి పంపుతారు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఆషాడం రాగానే చాలా మంది మహిళలు గోరింటాకును గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తోంది. మరోవైపు ఈ మాసం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది. ఈ నెల నుంచే వర్షకాలం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో యాగం నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు, గాలి, నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు పురణాలు చెబుతున్నాయి.

ఈ ఆషాడ మాసంలోనే హైదరాబాద్ లోని చారిత్రక గొల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో తొలి పూజ చేసిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి మొదలవుతోంది. ఈ తొలిబోనం సమర్పించే ఆనవాయితీ కుతుబ్ షా కాలం నుంచి రావడం విశేషం….ఈ విధంగా ఆషాడ మాసం లో అనేక విశిష్టతలు ఉన్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం