- Telugu News Photo Gallery Shrikhand Kailash, a unique holy place of Lord Shiva in Himachal Pradesh Telugu News
18 వేల అడుగుల ఎత్తులో శివ లింగం.. అమర్‌నాథ్ కంటే కష్టమైన శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర ప్రారంభం.. ఎప్పుడంటే..
హిమాలయాలన్నీ శివుని ఆవాసమే. కేదార్‌నాథ్, కైలాష్ మానసరోవర్, అమర్‌నాథ్ ఏదైనా సరే ఆ పరమశివుడు కొలువైన ఏ ప్రదేశానికి చేరుకోవడం అంత సులభం కాదు. అలాంటిదే ఈ ప్రదేశం కూడా. 18570 అడుగులు ఎక్కాల్సిన అటువంటి ప్రదేశం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 13, 2023 | 9:37 AM

ఈ ప్రదేశం పేరు శ్రీఖండ మహాదేవ్. ఈ ప్రదేశం హిమాచల్‌లోని సిమ్లాలో ఉంది. ఆ పరమశివుని దర్శనం కోసం ప్రజలు దాదాపు 35 కిలోమీటర్ల పొడవునా ప్రమాదకరమైన పర్వతారోహణ చేయాల్సి ఉంటుంది.

హిమాలయాలన్నీ శివుని ఆవాసమే. కేదార్‌నాథ్, కైలాష్ మానసరోవర్, అమర్‌నాథ్ ఏదైనా సరే ఆ పరమశివుడు కొలువైన ఏ ప్రదేశానికి చేరుకోవడం అంత సులభం కాదు. అలాంటిదే ఈ ప్రదేశం కూడా. 18570 అడుగులు ఎక్కాల్సి ఉంటుంది.

ఇక్కడ ఉన్న శివలింగం ప్రత్యేకమైనది. దాదాపు 72 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. శ్రీఖండ్ మహాదేవ్ వెళ్ళే మార్గంలో ఏడు ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రయాణం జూలై నెల నుండి ప్రారంభమవుతుంది. ప్రయాణంలో మూడు దశలు ఉన్నాయి. అవి: సింహగడ్, తాచడు, భీమ్ దువార్.

శివుడి చేత వరం పొందిన తరువాత విష్ణువు భస్మాసురుడిని నాట్యానికి ఒప్పించాడని నమ్ముతారు. అలా నాట్యం చేస్తున్నప్పుడు అతని తలపై చేయి వేసుకునేలా చేస్తాడు. దాంతో భస్మారుడు బూడిదగా మారిపోయిన ప్రదేశం ఇదే అని భక్తుల నమ్మకం.

ఇక్కడికి చేరుకోవాలంటే సిమ్లా వెళ్లాలి. ఆ తర్వాత రాంపూర్ నుంచి నిరోమండల్, బాగీపూల్ వెళ్లాలి. అక్కడ నుండి మీరు శ్రీఖండ్ వెళ్ళే రహదారిని చేరుకుంటారు.




