Zodiac Signs : ఈ 3 రాశులవారు ఖరీదైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు..! మీరు ఇందులో ఉన్నారా..?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి వ్యక్తికి 12 రాశిచక్రాలతో సంబంధం ఉంటుంది. ఈ రాశిచక్ర గుర్తుల ప్రకారం ప్రజలకు

Zodiac Signs : ఈ 3 రాశులవారు ఖరీదైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు..! మీరు ఇందులో ఉన్నారా..?
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: uppula Raju

Updated on: Jul 11, 2021 | 6:18 AM

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి వ్యక్తికి 12 రాశిచక్రాలతో సంబంధం ఉంటుంది. ఈ రాశిచక్ర గుర్తుల ప్రకారం ప్రజలకు కొన్ని లక్షణాలు. లోపాలు ఉంటాయి. సాధారణంగా వ్యక్తిత్వం ఈ లక్షణాలు, లోపాల ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది. ఒక వ్యక్తి స్వభావం అతడి విలువలు, ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని అలవాట్లు పుట్టినప్పటి నుంచి అతనికి వస్తాయి. దీనికి కారణం అతని గ్రహాలు, నక్షత్రరాశులు, రాశిచక్ర గుర్తులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..

కొంతమంది డబ్బు ఆదా చేయడంలో ప్లాన్ ప్రకారంగా వ్యవహరిస్తారు. బడ్జెట్ వేసి మరీ ఖర్చు చేస్తారు. అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేస్తారు. కొంతమంది మాత్రం వారికి ఏదైనా నచ్చిందంటే చాలు వెనకా ముందు ఆలోచించకుండా కొనేస్తారు. అంతేకాదు దానికి ఎంతైనా ఖర్చు చేస్తారు. ఈ మూడు రాశుల వారు ఇదే కోవాకు చెందినవారు. వీరు ఖరీదైన, బ్రాండెడ్ దుస్తులు, ఆభరణాలు, ఉపకరణాలను కొనడానికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు.

1. సింహరాశి సింహరాశి ప్రజలు షాపింగ్‌కి ఎక్కువగా ఖర్చు చేస్తారు. వారు మాత్రమే కాకుండా వారితో ఉన్నవారిని కూడా ఎక్కువగా ఖర్చు చేయడానికి ప్రేరేపిస్తారు. వారికి నచ్చిన వారికోసం ఎంత ఖర్చు పెట్టయినా సరే ఆ వస్తువులను కొంటారు. అంతేకాకుండా ఖరీదైన వస్తువులను కొని వాటిని ప్రియమైన వారికి గిప్ట్‌గా అందించడం అలవాటు.

2. వృషభ రాశి.. వృషభ రాశివారు అన్ని విషయాలలో నిష్ణాతులుగా ఉంటారు. మంచి అలవాట్లను కలిగి ఉంటారు. వీరు ప్రతిదానిలోనూ ఉత్తమమైనదాన్ని కోరుకుంటారు. ఏదైనా వందశాతం నాణ్యత ఉండాలి. షాపింగ్ చేయడానికి బయలుదేరినప్పుడు వీరు ఉత్తమ రేటింగ్‌లు, కస్టమర్ అనుభవాలను తెలుసుకొని ఖరీదైన వస్తువులను కొంటారు.

3. మేష రాశి మేషరాశి వారు ఖర్చుకు వెనుకాడరు. షాపింగ్ చేయడానికి నిత్యం ఆసక్తి కనబరుస్తారు. ఎల్లప్పుడూ నాటకీయంగా వ్యవహరిస్తారు. షాపింగ్ కోసం బయటకు వెళితే మొత్తం జీతాన్ని ఖర్చు చేస్తారు. విలాసవంతమైన వస్తువులకు కొంటుంటారు. అంతేకాదు నచ్చిన వాటికోసం బేరం ఆరడం వంటివి చేయరు. ఎంత డబ్బు అయినా సరే ఇచ్చేస్తారు.

Bajaj Electric Scooter : త్వరలో మార్కెట్‌లోకి ‘బజాజ్ చేతక్ స్కూటర్’..! హైదరాబాద్‌లో అమ్మకాలు..?

Kathi Mahesh : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కత్తి మహేశ్..! ఆయన చివరి పోస్టులు ఇవే..

Harwinder Kaur : ఆమె సంకల్పం ముందు ‘హైట్’ తలవంచింది..! లాయర్‌గా మారిన 3 అడుగుల యువతి..