Sabarimala Temple: శబరిమల ఆలయంలో సంచలన ప్రవేశం.. స్వామిని దర్శించుకున్న ట్రాన్స్ జెండర్ నిషా
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం పై 2019లో పెద్ద రచ్చే జరిగింది. ఈ వివాదం అటు ఉంచితే తాజాగా శబరిమల ఆలయంలో సంచలనం చోటుచేసుకుంది. కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు విధిగా శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం సాధారణమే. అయ్యప్ప స్వామి దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున స్వాములు శబరిమలకు తరలి వస్తుంటారు. దీంతో శబరిమల ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. శతాబ్దాల నుంచి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు గుడిలోకి ప్రవేశించకూడదనే ఆచారం కొనసాగుతోంది. అయితే ఈసారి శబరిమల ఆలయంలో ఆదివారం సంచలనం చోటు చేసుకుంది. ఆ సంచలనం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కేరళ రాష్ట్రంలోని శబరిమల గిరుల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల. ఇక్కడ కొలువైన దేవుడు.. అయ్యప్పను హిందువులు హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని స్వాముల విశ్వాసం. ప్రతి ఏటా నవంబర్ మాసంలో అయ్యప్ప దీక్ష మాలను ధరించి సంక్రాంతి సమయంలో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్పను ‘‘ఆ జన్మ బ్రహ్మచారిగా’’ పేర్కొంటూ, శతాబ్దాల నుంచి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రుతుచక్రం కొనసాగే మహిళలు గుడిలోకి అడుగు పెట్టకూడదనే ఆచారం కొనసాగుతోంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం పై 2019లో పెద్ద రచ్చే జరిగింది. ఈ వివాదం అటు ఉంచితే తాజాగా శబరిమల ఆలయంలో సంచలనం చోటుచేసుకుంది. కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి అమావాస్య రోజున దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడి స్వామి వారిని దర్శించుకుంటారు. వార్షిక బ్రహోత్సవాలు, ప్రతి అమావాస్యకు చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయ పూజల్లో జోగినిగా ట్రాన్‌జెండర్ నిషా క్రాంతి పాల్గొంటారు. ట్రాన్స్ జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. దీంతో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ దర్శించుకున్న ఘటన చోటు చేసుకుంది.
కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
శబరిమల గిరుల్లో వెలసిన అయ్యప్ప స్వామి దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ట్రాన్స్ జెండర్ జోగిని నిషా క్రాంతి.. కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్స్ జండర్‌లు చాలా మంది అయ్యప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని భావిస్తున్నారని ఆమె చెప్పారు. ట్రాన్స్ జెండర్ గా తనకు దర్శనం కల్పించడం.. శుభ పరిణామమని తెలిపారు. అందరి మాదిరిగా తాను కూడా శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో జన్మ ధన్యమైందని నిషా క్రాంతి తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








