AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapan Shastra: కలలో కుక్క కనిపిస్తుందా.. ఇలా కనిపిస్తే ద్రోహానికి సంకేతం.. తస్మాత్ జాగ్రత్త..

కలలు మన నిద్రకి మంచి సహచరులు మాత్రమే కాదు.. అవి మన భవిష్యత్తు తెలియజేసే సంకేతాలను తెలియజేస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కుక్కలు కనిపిస్తే.. కుక్కలు కనిపించే విధానం బట్టి.. ఆ కలకు కూడా కొన్ని రకాల అర్ధాలు ఉన్నాయట. స్నేహం, శత్రుత్వం, ఆనందం లేదా హెచ్చరిక వంటి సందేశాలను కుక్కల రూపంలో ఇస్తుందట. కలకు ఖచ్చితమైన అర్థం కుక్క రంగు, ప్రవర్తన, కలలో అది కనిపించే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది.

Swapan Shastra: కలలో కుక్క కనిపిస్తుందా.. ఇలా కనిపిస్తే ద్రోహానికి సంకేతం.. తస్మాత్ జాగ్రత్త..
Meaning Of Seeing A Dog In Dreams
Surya Kala
|

Updated on: Aug 16, 2025 | 11:54 AM

Share

మన పూర్వీకులు కలలు భవిష్యత్తుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయని నమ్మేవారు. స్వపన శాస్త్రం ప్రకారం ప్రతి కలకు దాని సొంత అర్థం ఉంటుంది. కుక్కలు మానవులకు నమ్మకమైన సహచరుడిగా పరిగణించబడే ఒక జీవి. అయితే కుక్కలను కలలలో చూడటం ఎల్లప్పుడూ శుభప్రదం కానవసరం లేదు. కుక్క రంగు, దాని ప్రవర్తన , కలలో అది కనిపించే పరిస్థితిని బట్టి ఆ కలకి సంబంధించిన నిజమైన అర్థాన్ని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది.

కలలో కుక్కను చూడటం అంటే ఎల్లప్పుడూ ఒకే అర్థం ఉండదు. ఆ కలకు అర్థం కుక్క రంగు, ప్రవర్తన, కలలో దాని పాత్రపై ఆధారపడి ఉంటుంది. తదుపరి ఈ సారి మీకు ఇలాంటి కల వచ్చినప్పుడు, ఈ సంకేతాలను గుర్తుంచుకోండి. బహుశా ఈ కలలు మీ భవిష్యత్ కు రహస్య సందేశం కావచ్చు.

తెల్ల కుక్క – స్నేహం, శుభవార్త ఎవరి కలలోనైనా తెల్ల కుక్క కనిపిస్తే అది సానుకూల సంకేతం. ఈ కల నిజమైన, నమ్మకమైన స్నేహితులను కనుగొంటారని ఇది సూచిస్తుంది. అలాగే జీవితంలో కొత్త అవకాశాలు, ఆనందం మీ తలుపు తడతాయి. తెల్ల కుక్క సంబంధాలలో విధేయత, స్థిరత్వానికి చిహ్నం కూడా.

ఇవి కూడా చదవండి

నల్ల కుక్క కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. స్వప్న శాస్త్రంలో నల్ల కుక్కను అశుభంగా భావిస్తారు. ఒక నల్ల కుక్క మిమ్మల్ని చూస్తున్నట్లు లేదా మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు కల వస్తే.. ఆ కలకు అర్ధం.. మీకు తెలియని శత్రువు ఉనికిని, ప్రతికూల శక్తిని లేదా చెడు ప్రణాళికను సూచిస్తుంది. ఈ కల మిమ్మల్ని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది.

వెంటాడుతున్న కుక్క కుక్క మిమ్మల్ని వెంటాడుతున్నట్లు కల వస్తే.. ఆ కల మీలో దాగి ఉన్న అభద్రతాభావాలను, మీలో దాగిన భయాలను సూచిస్తుంది. మీరు ఒక క్లిష్టమైన నిర్ణయం నుంచి పారిపోతున్నట్లు లేదా కొంత బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్లు ఈ కల తెలియజేస్తుంది.

కుక్క కాటు ద్రోహానికి సంకేతం. కలలో కుక్క కరిచడం అనేది అత్యంత తీవ్రమైన సంకేతాలలో ఒకటి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవచ్చని ఇది సూచిస్తుంది. ఈ కల మీ వెనుక గోతులు తీస్తున్నారని.. మీ వెనుక జరుగుతున్న ద్రోహం, మోసం లేదా కుట్రను సూచిస్తుంది.

కుక్కతో ఆనందంగా ఆడుకున్నట్లు కల వస్తే మీరు కుక్కతో ఆడుకుంటున్నట్లు కలలుగన్నట్లయితే.. ఆ కల కూడా రానున్న కాలంలో సంబంధాలు బలోపేతం అవుతాయని.. కొత్త అవకాశాలు కలుగానున్నాయని ఈ కల సూచిస్తుంది. ఇది జీవితంలో సానుకూల మార్పులకు, ఆనందం రాకకు చిహ్నం.

కుక్క ఏడుపు లేదా మొరిగితే స్వప్న శాస్త్రంలో కుక్క ఏడుపు లేదా మొరిగే శబ్దం వినిపిస్తే.. ఈ కల ప్రతికూల సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది రాబోయే కాలంలో ఏదైనా ప్రమాదకరమైన సంఘటన లేదా చెడు వార్తల గురించి హెచ్చరిక కావచ్చు.

మానసిక విధానం మనస్తత్వశాస్త్రం ప్రకారం కలలో కనిపించే కుక్క మీ ఉపచేతన మనస్సు భావోద్వేగాలకు ప్రతిబింబం. ప్రశాంతమైన, నమ్మకమైన కుక్క మంచి సంబంధాలను, భావోద్వేగ స్థిరత్వాన్ని సూచిస్తుంది. అయితే కోపంగా లేదా కొరికే కుక్క కనిపిస్తే మీలో అణచివేయబడిన కోపం, ఒత్తిడి, పరిష్కరించని సంఘర్షణలను సూచిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.