AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Floods: పాకిస్తాన్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. 200 మంది మృతి, వందలాది మంది గల్లంతు.. వీడియో వైరల్

దాయాది దేశం పాకిస్తాన్ సహా ఆక్రమిత కశ్మీర్ లో గత 24 గంటలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా దాదాపు 200 మంది మరణించారని, చెడు వాతావరణం కారణంగా రెస్క్యూ హెలికాప్టర్ కూడా కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కొండలు, పర్వతాలలో భారీ వర్షాల కారణంగా మేఘాలు విస్పోటనం, ఆకస్మిక వరదలు, పిడుగులు పడటం, భవనాలు కూలిపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించిందని వారు తెలిపారు.

Pakistan Floods: పాకిస్తాన్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. 200 మంది మృతి, వందలాది మంది గల్లంతు.. వీడియో వైరల్
Pakisthan Floods
Surya Kala
|

Updated on: Aug 16, 2025 | 10:09 AM

Share

పాకిస్తాన్ లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 36 గంటల్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కనీసం 214 మంది మరణించారని.. అనేక మంది గాయపడ్డారని అధికారులు ధృవీకరించారని పిటిఐ నివేదించింది. ఈ మరణాలు అధికంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో సంభవించాయి. అక్కడ తీవ్రమైన వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదలు మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. అనేక భవనాలను ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని కారకోరం హైవే, బాల్టిస్తాన్ హైవేతో సహా ప్రధాన రహదారులను దిగ్బంధం చేశాయి. దీంతో రవాణాకు అంతరాయం కలుగుతుందని చెప్పారు. అంతేకాదు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆగస్టు 21 వరకు అడపాదడపా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

గత 24 గంటల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా అంతటా సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 14 మంది మహిళలు, 12 మంది పిల్లలు సహా కనీసం 198 మంది మరణించారని.. అనేక మంది గల్లంతయ్యారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (PDMA) ప్రతినిధి తెలిపారు. వర్షాలు, వరదలు సృష్టించిన సంక్షోభం మధ్య వైద్య సహాయంపై దృష్టి పెట్టారు. మందుల నిరంతర లభ్యమయ్యేలా, వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయడానికి అన్ని ఆసుపత్రులు వరద నియంత్రణ గదులను ఏర్పాటు చేయాలని ప్రావిన్స్ వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఘైజర్ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదలు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి, ఇద్దరు వ్యక్తులు ఇంకా కనిపించడం లేదని అధికారులు తెలిపారు. వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి, డజనుకు పైగా ఇళ్ళు, వాహనాలు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ధ్వంసం చేశాయి. కారకోరం, బాల్టిస్తాన్ హైవేలు సహా ప్రధాన రహదారులు అనేక చోట్ల జల దిగ్బంధంలో ఉన్నాయి.

ఈశాన్యంలోని నీలం లోయ కూడా తీవ్ర సహాయానికి అంతరాయం కలుగుతుంది. ఈ ప్రాంతంలోని పర్యాటకులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రట్టి గాలి సరస్సు సమీపంలోని 600 మందికి పైగా శిబిరాలను తరలించారు. ఆకస్మిక వరదలు లావత్ నుల్లాపై ఉన్న రెండు వంతెనలను కూడా కొట్టుకుపోయాయి. ఉబ్బిన జాగ్రన్ నుల్లా కుండల్ షాహిలోని మరొక వంతెనను నాశనం చేశాయి.

జీలం లోయలో పాల్హోట్ పై కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీని వలన రోడ్డు నెట్‌వర్క్‌లో కొంత భాగం దెబ్బతింది. డజన్ల కొద్దీ వాహనాలు చిక్కుకుపోయాయి. నీలం నది నీటి మట్టం వేగంగా పెరుగుతూనే ఉండటంతో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ముజఫరాబాద్ జిల్లాలోని సర్లి సచా గ్రామంలో వినాశకరమైన కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిని కుప్పకూల్చాయి. ఆరుగురు కుటుంబ సభ్యులు సమాధి అయ్యారు. వారు ఆ శిధిలాల కిందే మరణించి ఉంటారని భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..