AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JK Cloudburst Video: కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న శవాలు… ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన భక్తులు!

అసలు కిష్త్వార్‌లో ఇంతగనం వర్షం పడే అవకాశం లేదు. కాని ఏడాది అంతటిలో కురవాల్సిన వర్షం.. నిన్న ఒక్కరోలే.. ఒక్క గంటలో కురిసింది. దీంతో కొండలపై నుంచి వరద తన్నుకొచ్చింది. అక్కడున్న రాళ్లు రప్పలు, చెట్లు చెదారం అంతా కిందకు జారింది. జనం హాహాకారాలు...

JK Cloudburst Video: కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న శవాలు... ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన భక్తులు!
Rescue People Stuck Chashot
K Sammaiah
|

Updated on: Aug 15, 2025 | 8:31 PM

Share

అందాల కాశ్మీరం.. కన్నీటి సంద్రమైంది. కిష్వార్‌లోని చండీ మాతా మచైల్‌ యాత్రకు వెళ్లిన భక్తులు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. ఒక్కసారిగా కురిసిన కుండపోతతో.. అక్కడి కొండల నుంచి పెద్ద పెద్ద బండరాలు.. భక్తులు బసచేస్తున్న గుడారాలు, క్యాంపులపై పడ్డాయి. అంతేకాదు.. వరద పోటుకి చాలామంది లోయల్లో కొట్టుకుపోయారు.

అసలు కిష్త్వార్‌లో ఇంతగనం వర్షం పడే అవకాశం లేదు. కాని ఏడాది అంతటిలో కురవాల్సిన వర్షం.. నిన్న ఒక్కరోలే.. ఒక్క గంటలో కురిసింది. దీంతో కొండలపై నుంచి వరద తన్నుకొచ్చింది. అక్కడున్న రాళ్లు రప్పలు, చెట్లు చెదారం అంతా కిందకు జారింది. జనం హాహాకారాలు పెడుతూ పరుగులు తీసినా లాభం లేకుండా పోయింది. ఆ వరదలు వందల మంది కొట్టుకుపోయారు. బండరాళ్లు మీదపడి చాలామంది చిక్కుకుపోయారు. బయటకు తీస్తుంటే శవాలు బయటపడుతున్నాయి కాని.. ఎవరూ సజీవంగా రావడంలేదు.

సడన్‌ క్లౌడ్‌ బరస్ట్‌ మాతా మచైల్‌యాత్రలో విషాదాన్నే నింపింది. శిథిలాల కింద 500మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పదుల సంఖ్యలో మృతులు బయటపడుతుండం.. అటు ఆప్తులు తమ వారి శవాలను చూసి గుండెలవిసేలా రోదించడం కిష్త్వార్‌లో కనిపిస్తున్న దృశ్యాలు. అటు ఆస్పత్రుల్లో చాలామంది క్షతగాత్రులు ప్రాణాలతో పోరాడుతున్నపారు. అక్కడి దృశ్యాలు భీతావాహంగా ఉన్నాయి.

వీడియో చూడండి:

ప్రస్తుతం కిష్త్వార్‌లో NDRF, SDRF, CISF, CRPF, జమ్ముకశ్మీర్‌ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. అటు స్థానికులు కూడా వీరికి సాయం చేస్తున్నారు. జాగిలాలతో తనిఖీలు జరుపతున్నారు. అయితే మృతుల్లో భక్తులే కాకుండా.. స్థానికులు, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌ సీఎం రెస్క్యూ ఆపరేషన్స్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉదయం శ్రీనగర్‌లో జెండా వందనంలో పాల్గొన్న ఒమర్‌ అబ్దుల్లా తర్వాత కిష్త్వార్‌కు బయల్దేరి వెళ్లారు. అటు ప్రధాని కూడా దీనిపై ఎప్పటికపుడు ఆరాతీస్తున్నారు.

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ