Tirumala: చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. తిరుమలలో భక్తుల కష్టాలపై పరిపూర్ణానంద సీరియస్..

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తీసుకుంటున్న నిర్ణయాలపై స్వామి పరిపూర్ణానంద సరస్వతి (Swami Paripoornananda saraswati) స్పందించారు. శ్రీవారికి నిత్యం జరిగే ఆర్జిత సేవల విషయంలో..

Tirumala: చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. తిరుమలలో భక్తుల కష్టాలపై పరిపూర్ణానంద సీరియస్..
Tirumala Tirupati
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2022 | 5:01 PM

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తీసుకుంటున్న నిర్ణయాలపై స్వామి పరిపూర్ణానంద సరస్వతి (Swami Paripoornananda saraswati) స్పందించారు. శ్రీవారికి నిత్యం జరిగే ఆర్జిత సేవల విషయంలో టీటీడీ ఏకపక్ష వైఖరి సబబు కాదని అన్నారు.  భక్తుల సౌకర్యార్థం అంటూ ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవాన్నీ రద్దు చేయడం శ్రేయస్కరం కాదని చెప్పారు. స్వామి వారి ఆగ్రహానికి అధికారులు గురి కావద్దంటూ హెచ్చరించారు. అధికాలు వెంటనే ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని సూచించారు స్వామి పరిపూర్ణానంద సరస్వతి.

అంతేకాదు తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తులకు కనీస సౌకర్యాలు అందించే విషయంలో టీటీడీ పూర్తిగా విఫలమైందని చెప్పారు. వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం టీటీడీపై ఉందన్నారు. చలువ పందిళ్లు, తిరుమాడ వీధుల్లో వైట్ పెయింట్ వేయించాలంటూ పలు సూచనలు చేశారు.  తిరుమలకు వచ్చే భక్తులకు వేసవి తాపం నుంచి విముక్తి కలిగించాలని కోరారు.  చాలా మంది భక్తులు పిర్యాదుతోనే తిరుమల పూజలు, సౌకర్యాల విషయంపై తిరుమలలో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తాను శ్రీవారి దర్శనం కోసం రాలేదని, భక్తుల సమస్యలను టీటీడీకి తెలిపేందుకు వచ్చానని అన్నారు. దేశ వ్యాప్తంగా ధార్మిక సదస్సు ఏర్పాటు చేసి టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. టీటీడీ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్వామి పరిపూర్ణానంద సరస్వతి హెచ్చరించారు.

Also Read:

Rare Kangaroo: ఓ మహిళ కంట పడిన అరుదైన కంగారూ.. శ్వేత వర్ణంలో మెరిసిపోతూ.. గంతులు

Inspiring Story: 3 వేలతో మొదలై.. లక్షలు దాటిన బిజినెస్‌.. స్వయం ఉపాధితో రాణిస్తూ.. 19మందికి ఉపాధినిస్తున్న మహిళ

Expensive Mango: ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు..సూర్య రశ్మి గుడ్లుగా ప్రసిద్ధి.. కిలో 2.70 లక్షలు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..