Shiva Purana: ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఆరు మాసాల్లో మరణం.. శివపురాణం ఏం చెబుతోంది?

Shiva Purana: సనాతన హిందూ ధర్మలో(Hindu Dharma) కర్మ సిద్ధాంతాన్ని(Karma Siddhantam) నమ్ముతారు. పుట్టుక, మనిషి జీవితం, చావు అన్నీ కార్మానుసారమే జరుగుతాయని పురాణాల్లో..

Shiva Purana: ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఆరు మాసాల్లో మరణం.. శివపురాణం ఏం చెబుతోంది?
Signs Before Death
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2022 | 6:21 PM

Shiva Purana: సనాతన హిందూ ధర్మలో(Hindu Dharma) కర్మ సిద్ధాంతాన్ని(Karma Siddhantam) నమ్ముతారు. పుట్టుక, మనిషి జీవితం, చావు అన్నీ కార్మానుసారమే జరుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి మరణానికి ముందు, అతని ముందు అనేక రకాల సంకేతాలు, సూచనలు కనిపించడం ప్రారంభమవుతాయట. ఇదే విషయాన్నీ శివ పురాణంలో కూడా పేర్కొన్నారట. మనిషి మరణానికి ముందు వచ్చే సంకేతాల గురించి పరమశివుడు తల్లి పార్వతిదేవి చెప్పినట్లు శివపురాణంలో ఉంది. చావు పుట్టుకలు ఏవీ మనిషి చేతుల్లో లేవు.. ఎన్ని సంవత్సరాలు జీవించినా.. మనిషి జీవితం మరణంలో భూమి మీద ప్రయాణం సమాప్తమవుతుంది. అయితే మరణం ముంచుకొస్తోందని ముందే మనిషికి ముందే  తెలిసిపోతుందా..ఇందుకు సంకేతాలున్నాయా..శివపురాణంలో ప్రత్యేకంగా ప్రస్తావించారా.. ఇంతకీ ఏంటా సంకేతాలు ఈరోజు తెలుసుకుందాం..

  1. శివపురాణం ప్రకారం, పార్వతి దేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది.. “స్వామి..! మరణానికి సంకేతం ఏంటి, మరణం రాబోతోందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. అప్పుడు శివుడు పార్వతికి చెప్పిన మరణ సంకేతాలు ఏమిటంటే..
  2. శరీర రంగు: ఏ వ్యక్తి శరీరం రంగైనా తెలుపు లేదా నీలం రంగులోకి మారినట్లయితే, అటువంటి వ్యక్తి త్వరలో మరణించనున్నాడని సంకేతం. అలాంటి వ్యక్తి 6 నెలల్లో చనిపోవచ్చునని అర్ధం.
  3. మనిషిని నీడ విడిచి వెళ్లిపోవడం: ఏ వ్యక్తికైనా నీడ అతని వెంటనే నడుస్తుంది. ఆయితే  అలాంటి నీడ శరీరాన్ని వీడి.. స్వంతగా ప్రయాణిస్తుంటే.. అలా శరీరం నుంచి నీడను వేరుకావడం మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది. మరణ సమయంలో నీడ కూడా మనిషిని వదిలి వెళ్లిపోతుంది.
  4. తన ప్రతిభింబాన్ని చూడలేకపోవడం: నీరు, నూనె , అద్దం, నెయ్యి, సీసం వంటి వాటిల్లో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో మరణిస్తాడట.
  5. రంగులను గుర్తించడంలో ఇబ్బంది: శివ పురాణం ప్రకారం, ఒక వ్యక్తికి రంగులు గుర్తించడంలో ఇబ్బంది కలుగుతున్నా..  లేదా అకస్మాత్తుగా ప్రతి వస్తువు నలుపు రంగులో కనిపిస్తే, అతని మరణం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి.
  6. ఎడమ చేయి మెలికలు: ఏ వ్యక్తికైనా ఎడమచేతిలో ఒక వారం పాటు నిరంతరాయంగా మెలికలు తిరుగుతూ ఉంటే, ఆ వ్యక్తికి రోజులు గడిచిపోయాయని, అంటే అతని మరణం ఒక నెలలో సంభవించవచ్చని అర్థమట
  7. నీలి ఈగలు: ఎవరి ఇంట్లో నైనా నీలి రంగులో ఈగలు కనిపిస్తే.. ఆ ఇంట్లో మరణాన్ని సూచిస్తున్నాయని అర్ధమట. నీలి ఈగలు అకస్మాత్తుగా వచ్చి ఒక వ్యక్తిని చుట్టుముట్టినట్లయితే, అతని మరణం సమీపంలో ఉందని అర్థం చేసుకోవాలట.
  8. మూడు దోషాలు కలిసినప్పుడు: ఒకే సమయంలో మూడు దోషాలు మానవ శరీరంలో ఏకకాలంలో కలిగితే.. మనిషి మానవ శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని నమ్ముతారు. కఫ, పిత్త , వాత దోషాలను త్రిదోషాలు అని అంటారు.
  9. చంద్రుడు, సూర్యుడు , అగ్ని కాంతిని చూడలేకపోయినా ఎరుపు రంగులో కనిపించినా ఇక జీవించేది ఆరు నెలలేనట.
  10. తీతువు పిట్ట ఇంటిపైనుంచి వెళ్లినా . ఇంటి చుట్టూ అర్ధరాత్రి కుక్కలు అరుస్తూ ఉన్నా.. ఆ ఇంట్లోని వ్యక్తి మరణానికి చేరువలో ఉన్నామన్న సంకేతమేనట

(శివపురాణంలో ప్రస్తావించినవి మాత్రమే..  పురాణాల కథలు, మనిషి చావు పుట్టుకలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన కలలు నిజమే శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Viral Video: చిన్నారి బాలిక మ్యాజిక్ టాలెంట్ .. నెట్టింట్లో వీడియో వైరల్.. 60లకుపైగా లైక్స్ సొంతం

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి