Hanuman Birthplace: హనుమంతుడి జయంతి పై , విశాఖ శారదా పీఠం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గోవిందానంద స్వామి
Hanuman Birthplace: ఆంజనేయుడి జన్మస్థలంపై వివాదం కొనసాగుతూనే ఉంది. అంజనాద్రి హనుమంతుడి జన్మస్తానం అంటూ ప్రకటించిన టీటీడీ కమిటీకి ప్రామాణికత...
Hanuman Birthplace: ఆంజనేయుడి జన్మస్థలంపై వివాదం కొనసాగుతూనే ఉంది. అంజనాద్రి హనుమంతుడి జన్మస్తానం అంటూ ప్రకటించిన టీటీడీ కమిటీకి ప్రామాణికత లేదని గోవిందానంద సరస్వతి వ్యాఖ్యానించారు. అంతేకాదు హనుమంతుడి జయంతి వేడుకపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. హనుమంతుని జన్మ విషయంలో టిటిడి తప్పుడు లెక్కలు చూపించి.. ఇప్పుడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారని ఆరోపించారు. నాలుగు నెలలపాటు పరిశోధన చేసిన టీటీడీకీ హనుమాన్ జయంతి ఎప్పుడో తెలియకపోవటం హస్యాస్పదం అని ఆయన విమర్శిచారు. వేంకటాచల మహత్యం అనే గ్రంధంలో హనుమంతుని జయంతి శ్రావణ మాసం లో ఆచరించాలని ఉందని… కానీ ఇపుడు ఎందుకు ఆచరిస్తున్నారో అర్ధం కావటంలేదని ఆయన అన్నారు.
హనుమంతుడి జన్మస్ధలం తిరుమల గిరుల్లోని జాపాలి తీర్థం అని ప్రకటించిన టీటీడీ… ఈ రోజు ఆకాశగంగ తీర్థంలో జయంతి వేడుకలను నిర్వహించటాన్ని గోవిందానంద సరస్వతి తప్పుపట్టారు. హనుమంతుని జయంతి చైత్ర పూర్ణిమ లో ప్రపంచ వ్యాప్తంగా చేయడం జరుగుతోందని… టీటీడీ సత్యాన్ని కప్పిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందని అన్నారు. మరోవైపు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర డూప్లికేట్ నెంబర్ వన్ ఆని వ్యాఖ్యానిస్తూ….సన్యాసులకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండకూడదని అన్నారు. సీఎం మద్దతు ఉన్నంత మాత్రాన విశాఖ శారదా పీఠం శంకర మఠం కాబోదని గోవిందానంద సరస్వతి ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read: కర్పూరం ఎలా తయారవుతుంది ఏయే దేశాల్లో ఈ మొక్కలుంటాయి.. ఎన్ని రకాలో తెలుసుకుందాం..