Tirumala: పెద్దశేష వాహనంపై గోవిందుడి వైభవం.. వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయ్..
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు పడుతూ స్వామివారిని సేవించుకున్నారు.

తిరుమల తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు పడుతూ స్వామివారిని సేవించుకున్నారు.
ఇకపోతే, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు.
9 రోజుల పాటు జరుగనున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు వివరాలు ఇలా ఉన్నాయి..
– 02వ తేదీ రాత్రి 07 గం.లకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు.
– 03.06. 2025 – ఉదయం – చిన్నశేష వాహనంపై, రాత్రి – హంస వాహనం
– 04.06. 2025 – ఉ. – ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం
– 05.06. 2025 – ఉ. – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం
– 06.06. 2025 – ఉ. – మోహినీ అవతారం, రాత్రి – గరుడ వాహనం
– 07.06. 2025 – ఉ. – హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనం
– 08.06. 2025 – ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
– 09.06. 2025 – ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
– 10.06. 2025 – ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




