Diabetes: డయాబెటిస్ రోగులు తేనె తీసుకోవచ్చా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక సహజ స్వీటెనర్. తేనెలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మన కణాలను రక్షిస్తాయి. తేనెలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగిస్తున్నారు. కానీ, మధుమేహం ఉన్నవారు తేనెను తినడం మంచిదేనా..? ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Updated on: Jun 02, 2025 | 11:48 AM

అయితే, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తేనెను మధుమేహం ఉన్నవారు తేనెను మితంగా తినవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తేనెలోని తియ్యదనం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారను. అయితే, తేనెలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుందని చెబుతున్నారు.

అలాగే తేనెలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. అందుకే మధుమేహం ఉన్నవారు తేనెను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి తక్కువ పరిమాణంలో తేనె తీసుకోవాలి.

Honey

ఖాళీ కడుపుతో కాకుండా ఏదైనా ఆహారంతో తేనె తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. అయితే, తేనె ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో తేనెను చేర్చుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

ఆరోగ్యకరమని తేనెని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఏదైనా సరే ఆరోగ్యకరమైనప్పటికీ వాటిని తక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని సూచిస్తున్నారు.




