AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: సింహ వాహనంపై శ్రీవారి దర్శనం.. కన్నుల పండుగగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

Tirupati: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలమద్య సాగింది. జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. సింహ వాహనంపై ధైర్యసిద్ధిని ప్రసాదించిన శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు.

Tirupati: సింహ వాహనంపై శ్రీవారి దర్శనం.. కన్నుల పండుగగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
Tirumala Venkateshwara Swamy
Raju M P R
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 20, 2023 | 9:20 PM

Share

Tirupati: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలమద్య సాగింది. జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. సింహ వాహనంపై ధైర్యసిద్ధిని ప్రసాదించిన శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం కాగా ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమైందిగా భక్తులు భావిస్తున్నారు. సింహ రూప దర్శనంతో స్వామివారిని దర్శిస్తే విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుందని విశ్వసించే భక్తులు అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని వాహన సేవ ద్వారా శ్రీవారు నిరూపించారు. ఇక వాహన సేవలో పాల్గొన్న భూమన కరుణాకర్ రెడ్డి ఈఓ ధర్మారెడ్డి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే చిన్నపిల్లలలు త‌ప్పిపోకుండా జియో ట్యాగింగ్ ప్రారంభించారు.

ఇక రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మివ్వనుండగా సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు టిటిడి చైర్మన్ భూమన. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సింహ వాహనసేవలోనే మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆవిష్కరించారు. ఇక సింహ వాహ‌న‌సేవ‌లో కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 10 క‌ళాబృందాలలో 206 మంది క‌ళాకారులు ప్రద‌ర్శన‌లిచ్చారు.

తమిళనాడు రాష్ట్రం, శ్రీరంగానికి చెందిన భగవద్రామానుజ సంప్రదాయ పరంపరను తెలిపే దాసవైభవం రూపకం, కర్ణాటక రాష్ట్ర నృత్య సంప్ర‌దాయాలైన డోలుకునిత డోలువాయిద్య విన్యాసం, కల్పశ్రీ, పూజ కునిత, గోపికా రూప కాంతలై జానపద కళా నృత్యరూపకం ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా, దాసనమనం, గొరవర కునిత, వీరగాసె, మైసూరుకు చెందిన దాస సంకీర్తన రూపకం, విజయవాడకు చెందిన కంకిపాడు కోలాట భజన సంప్రదాయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..