AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhasma for Lord Shiva: భస్మం అంటే అర్ధం.. శివుడికి పురుషులు మాత్రమే భస్మాన్ని సమర్పిచడం వెనుక రీజన్ ఏమిటంటే..

భస్మంలో ఉన్న రెండు పదాలకు ఉన్న అర్థమేమిటంటే.. భ అంటే భత్సర్ణం.. అంటే నాశనం చేయడం.. స్మ అంటే పాపములను నశింపజేసి భగవంతుడిని జ్ఞాపకం చేసేదని అర్థం. దీంతో భస్మం అంటే పాపాలను భస్మం చేసేదని పండితులు చెబుతున్నారు. జీవితంలోని అనిత్యాన్ని భభస్మం గుర్తు చేస్తూనే ఉంటుంది. భస్మమే పరమశివుని స్వరూపమని, దానిని ఉపయోగిచడం వల్ల దుఃఖాలు, పాపాలు నశిస్తాయి అని శివపురాణంలో చెప్పబడింది. భస్మాన్ని శుభప్రదంగా అభివర్ణించారు.

Bhasma for Lord Shiva: భస్మం అంటే అర్ధం.. శివుడికి పురుషులు మాత్రమే భస్మాన్ని సమర్పిచడం వెనుక రీజన్ ఏమిటంటే..
Lord Shvia Bhasma Aarti
Surya Kala
|

Updated on: Aug 03, 2023 | 11:54 AM

Share

లయకారుడు పరమశివుడి మహిమ అపారమైనది. జనన మరణ బంధముల నుంచి విముక్తుడిని చేసి ఇతరుల దుఃఖాతాలను పొగ్గువాడు అని హిందువుల విశ్వాసం. శివయ్య కరుణామయుడు.. మనస్ఫూర్తిగా భక్తితో జలం సమర్పించి నమస్కరిస్తే చాలు వారి భక్తికి సంతోషించి.. తన ఆశీర్వాదాలను కురిపిస్తాడని నమ్మకం. అందుకే శివయ్యను భోళాశంకరుడు అని కూడా పిలుస్తారు. అంతేకాదు శివుడి జీవన విధానం ఇతర దేవుళ్లలా ఉండదు. స్మశాన నివాసి.. పాములు ఆభరణంగా ధరించేవాడు.. శరీరానికి బూడిదను.. భస్మాన్ని  పూసుకునే శంకరుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు భక్తులు. భస్మం అంటే శివుడికి ఇష్టమని.. పురాణాల గ్రంథాల్లో చెప్పారు. ఈ రోజు దేవాధిదేవుడు బూడిదను శరీరంపై ఎందుకు పూసుకుంటాడో ఈ రోజు తెలుసుకుందాం..

భస్మంలో ఉన్న రెండు పదాలకు ఉన్న అర్థమేమిటంటే.. భ అంటే భత్సర్ణం.. అంటే నాశనం చేయడం.. స్మ అంటే పాపములను నశింపజేసి భగవంతుడిని జ్ఞాపకం చేసేదని అర్థం. దీంతో భస్మం అంటే పాపాలను భస్మం చేసేదని పండితులు చెబుతున్నారు. జీవితంలోని అనిత్యాన్ని భభస్మం గుర్తు చేస్తూనే ఉంటుంది. భస్మమే పరమశివుని స్వరూపమని, దానిని ఉపయోగిచడం వల్ల దుఃఖాలు, పాపాలు నశిస్తాయి అని శివపురాణంలో చెప్పబడింది. భస్మాన్ని శుభప్రదంగా అభివర్ణించారు.

భస్మాన్ని శివునికి ఎందుకు సమర్పిస్తారంటే?

త్రినేత్రుడుకి భస్మం అంటే చాలా ఇష్టం. అందుకనే భస్మం శివయ్యకు అలంకారంగా పరిగణించబడుతుంది. శివుడికి భస్మాన్ని సమర్పించే భక్తుడిని త్వరగా అనుగ్రహిస్తాడని.. బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. భస్మాన్ని సమర్పించడం ద్వారా మనస్సు ప్రాపంచిక భ్రాంతి నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం. అయితే శివుడికి పురుషులు మాత్రమే భస్మాన్ని సమర్పిస్తారు. స్త్రీలు భస్మాన్ని సమర్పించడం శ్రేయస్కరం కాదు.

ఇవి కూడా చదవండి

శివుని దహనం వెనుక పౌరాణిక నమ్మకం

శివునికి ప్రీతిపాత్రమైన భస్మ ధారణ వెనుక ఉన్న పౌరాణిక నమ్మకం చాలా ప్రాచుర్యం పొందింది. సతీదేవి తన తండ్రి దక్షుడి యజ్ఞం చేస్తున్నప్పుడు యాగంలో తన శరీరాన్ని సతీదేవి అర్పించింది. సతీదేవి మృత దేహాన్ని పట్టుకుని శివుడు చేస్తున్న సమయంలో శ్రీ మహా విష్ణువు సతీదేవి మృతదేహాన్ని తన సుదర్శన చక్రంతో భస్మం చేశాడు. తనకు దూరమైన సతీదేవి గుర్తుగా శివుడు మృతదేహం బూడిదను తన శరీరంపై పూసుకున్నారు. అప్పటి నుండి మహాదేవుడికి భస్మ అంటే చాలా ఇష్టమని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)