Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు..

అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. దట్టమైన అడువుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది స్వామి వారిని దర్శించుకుంటారు. దక్షిణ భారత దేశం నుంచే కాకుండా ఉత్తర భారతం నుంచి భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు..

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు..
Special Trains
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 09, 2022 | 9:19 PM

అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. దట్టమైన అడువుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది స్వామి వారిని దర్శించుకుంటారు. దక్షిణ భారత దేశం నుంచే కాకుండా ఉత్తర భారతం నుంచి భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌ నుంచి కొట్టాయంకు ప్రత్యేక రైలును నడిపిస్తున్నారు. నర్సాపూర్‌ నుంచి కొట్టాయంకు వెళ్లే ట్రైన్‌ నెంబర్‌ 07119 రైలు శుక్రవారం ఉదయం 05.00 గంటలకు బయలుదేరీ, తర్వాతి రోజు 03.50 నిమిషాలకు గమ్యాన్ని చేరుకుంటుంది. 18-11-2022, 25-11-2022 తేదీల్లో ఈ రైలు బయలుదేరుతుంది. ఇక కొట్టాయం నుంచి నర్సాపూర్‌ వెళ్లే 07120 రైలు శనివారం 10.50 గంటలకు బయలుదేరీ తర్వాతి రోజు 16.00 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. 19-11-2022, 26-11-2022 తేదీల్లో ఈ రైలు బయలుదేరుతుంది.

Special Trains

ఇవి కూడా చదవండి

ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడా, విజయవాడ, తెనాలి, బాపట్లా, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కట్పడి, జోలర్‌పెట్టై, సలీమ్‌, ఎరోడ్‌, తిర్‌పుర్‌, కొయంబత్తురు, పలక్కడ్‌, త్రిషుర్‌, ఎన్నకులమ్‌ స్టేషన్స్‌లో ఆగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..