AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda Shashthi: సంతానం కోసం కుటుంబంలో సుఖ సంతోషాల కోసం స్కంద షష్ఠి పూజ ఫలవంతం.. ఎప్పుడు వచ్చిందంటే..?

ప్రతి నెల శుక్ల పక్షం షష్ఠి తిథి రోజున శివపార్వతుల తనయుడు కార్తికేయుడిని పూజిస్తారు. ఎందుకంటే ఈ తిథి కార్తికేయుడికి అంకితం చేయబడింది. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.

Skanda Shashthi: సంతానం కోసం కుటుంబంలో సుఖ సంతోషాల కోసం స్కంద షష్ఠి పూజ ఫలవంతం.. ఎప్పుడు వచ్చిందంటే..?
Skanda Shashthi
Surya Kala
|

Updated on: Oct 03, 2024 | 7:11 PM

Share

హిందూ మతంలో స్కంద షష్ఠి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి రోజున ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి నెల శుక్ల పక్షం షష్ఠి తిథి రోజున శివపార్వతుల తనయుడు కార్తికేయుడిని పూజిస్తారు. ఎందుకంటే ఈ తిథి కార్తికేయుడికి అంకితం చేయబడింది. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.

స్కంద షష్ఠి తిథి ఎప్పుడంటే

హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి అక్టోబర్ 8, మంగళవారం ఉదయం 11:17 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 9, బుధవారం మధ్యాహ్నం 12:34 గంటలకు ముగుస్తుంది. దీంతో ఉదయం తిథి ప్రకారం స్కంద షష్ఠి ఉపవాసం అక్టోబర్ 9 వ తేదీన మాత్రమే ఆచరించాల్సి ఉంటుంది. షష్టి ఉపవాసం మరుసటి రోజు అంటే అక్టోబర్ 10వ తేదీన విరమించాల్సి ఉంటుంది.

స్కంద షష్ఠి పూజ విధి విధానం ఏమిటంటే

స్కంద షష్ఠి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.

ఇవి కూడా చదవండి

పూజా స్థలాన్ని శుభ్రం చేసి, కార్తికేయ విగ్రహాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్టించండి.

పూజకు ముందు, కార్తికేయ విగ్రహాన్ని పూలతో అలంకరించండి.

పూజ సమయంలో కార్తికేయ స్వామి ముందు దీపం వెలిగించి, ధూపం వేయండి.

కార్తికేయ స్వామికి పూలు, పండ్లు, స్వీట్లు మొదలైన వాటిని సమర్పించండి.

పూజ సమయంలో, కార్తికేయుడిని ధ్యానిస్తూ మంత్రాలను జపించండి.

మంత్రం: దేవ సేనాపతే స్కంద కార్తికేయ భవోద్భవ| కుమార గ్రుహ్ గాంగేయ శక్తి హస్తా నమోస్తు తే ।(देव सेनापते स्कंद कार्तिकेय भवोद्भव। कुमार गुह गांगेय शक्तिहस्त नमोस्तु ते॥)

కార్తికేయుడిని పూజించిన తర్వాత.. కార్తికేయుని జన్మ రహస్యం కథను వినండి లేదా చదవండి.

పూజ ముగిసిన అనంతరం బ్రాహ్మణుడికి ఆహారాన్ని అందించండి. అంతేకాదు పేదలకు శక్తి మేరకు దానం చేయండి.

స్కంద షష్ఠి వ్రత నియమం

స్కంద షష్ఠి వ్రతం రోజున కొంతమంది భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. కొందరు భక్తులు కేవలం పండ్లను మాత్రమే తింటూ ఉపవాసం ఉంటారు.

ఉపవాస సమయంలో ప్రజలు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి.

రాత్రి జాగారం చేస్తూ భజనలు, కీర్తనలు ఆలపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

సంతానం కలగాలని స్కంద షష్ఠి వ్రతం పాటిస్తారు.

శత్రువులను నాశనం కోరుతూ ఈ వ్రతం పాటిస్తారు.

ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు ఆయురారోగ్యాలను పొందుతారు.

స్కంద షష్ఠి ప్రాముఖ్యత

స్కంద షష్ఠి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటారని మత విశ్వాసం. ఇలా సుభ్రమన్యస్వామి ని పూజించిన వారి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు పొందుతారు. ఈ రోజున స్త్రీలు సంతాన ప్రాప్తి కోసం , తమ పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కార్తికేయ భగవానుడితో పాటు శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు స్కంద షష్ఠి మర్నాడు ఆచారాల ప్రకారం, శుభ సమయంలో ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుది. ఇలా చేయడం ద్వారా ఉపవాసం విజయవంతం అవుతుంది. ఉపవాసం చేసిన పూర్తి ఫలితం పొందుతారు. జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

Follow Us