- Telugu News Photo Gallery Navaratri 2024: tour and travel places to visit near katra and vaishno devi mandir
Navaratri: నవరాత్రులకు వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్నారా.. వీటిని చూడడం మిస్ చేసుకోవద్దు..
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో చాలా మంది అమ్మవారి శక్తి పీఠాలను దర్శించుకునేందుకు ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా పిలుస్తారు. వైష్ణవి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది ఇక్కడికి వెళుతున్నా.. నవరాత్రుల సమయంలో మాత్రం అమ్మవారి ఆస్థానానికి దర్శనం కోసం ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు.
Updated on: Oct 03, 2024 | 6:50 PM

దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా వైష్ణో దేవి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఇక్కడ అమ్మవారి ఆలయం అందమైన పూల అలంకరణతో, విద్యుత్ దీపాల అలంకారంతో వెలిగిపోతోంది. మీరు కూడా నవరాత్రి సమయంలో వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించబోతున్నట్లయితే...కత్రా, జమ్మూలో ఉన్న ఇతర ఆలయాలను సందర్శించవచ్చు. ఈ ప్రదేశాలు సందర్శనకు సరైనవి. అవి ఏమిటో తెలుసుకుందాం..

బాటోట్ హిల్ స్టేషన్: ఈ అందమైన హిల్ స్టేషన్ కత్రా నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక రవాణా ద్వారా ఇక్కడకు వెళ్ళవచ్చు. ప్రకృతి ప్రేమికులు సందర్శించడానికి ఇది సరైన ప్రదేశం. దట్టమైన అడవిలో విడిది చేయడమే కాకుండా.. ఇక్కడ ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంది.

ఝజ్జర్ కోట్లి: కత్రా నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఝజ్జర్ కోట్లి ఉంది. అటువంటి పరిస్థితిలో వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళినట్లు అయితే సమీపంలో ఉన్న ఝజ్జర్ కోట్లికి కూడా వెళ్ళవచ్చు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ కూడా. కుటుంబం, స్నేహితులతో ఇక్కడకు వెళ్ళడం మంచి జ్ఞాపకంగా మిగులుతుంది.

పట్నితోప్: ఇది కత్రా నుండి 80 నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. సుద్ధమహాదేవ్ ఆలయం, సనాసర్ గ్రామం, బుద్ధ అమర్‌నాథ్ ఆలయం, బహు కోట, దేవాలయాలను సందర్శించవచ్చు. ఇక్కడ పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి కార్యకలాపాలు చేసే అవకాశాన్ని పొందవచ్చు.

సనసర్: కత్రా నుండి సనాసర్ దూరం 104 కిలోమీటర్లు. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 3 గంటల 20 నిమిషాలు పడుతుంది. ఇది పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి కార్యకలాపాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు శీతాకాలంలో ఇక్కడ స్కీయింగ్‌కు వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు. ఇది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ మీరు ప్రకృతిలో ప్రశాంతంగా గడిపే అవకాశాన్ని పొందవచ్చు.

శివఖోడి: కత్రా నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివ ఖోడి గుహ శివుని ప్రధాన ఆరాధనా స్థలాలలో ఒకటి. ఈ పవిత్ర గుహ దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుంది. గుహ లోపల 4 అడుగుల ఎత్తైన శివలింగం ప్రతిష్టించబడింది. పవిత్ర జలం ఎల్లప్పుడూ శివలింగంపై పడుతూ అభిషేకం చేస్తుంది. అయితే ఇక్కడికి వెళ్లే ముందు వాతావరణం, వెళ్ళే మార్గం గురించి సరైన సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం.




