- Telugu News Photo Gallery Mosquito coils are more harmful to your lungs than cigarettes, mosquito coil side effects
అది విషంతో సమానం.. పొగేగా అనుకుంటే ప్రాణాలు తీస్తుంది.. ఎంత ప్రమాదమో తెలుసా..
వర్షాకాలం మొదలైంది.. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. ముఖ్యంగా వర్షాకాలం దోమలకు సరైన సంతానోత్పత్తి సమయంగా పరిగణిస్తారు. దోమలు విజృంభిస్తుంటాయి.. అటువంటి పరిస్థితిలో మీరు డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా జ్వరం బారిన పడే ప్రమాదం ఉంది.
Updated on: Oct 03, 2024 | 6:02 PM

వర్షాకాలం మొదలైంది.. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. ముఖ్యంగా వర్షాకాలం దోమలకు సరైన సంతానోత్పత్తి సమయంగా పరిగణిస్తారు. దోమలు విజృంభిస్తుంటాయి.. అటువంటి పరిస్థితిలో మీరు డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా జ్వరం బారిన పడే ప్రమాదం ఉంది. దోమ కాటుతోనే ఇలాంటి వ్యాధులు ప్రబలుతాయి.. ఈ సీజనల్ జ్వరాలను, సమస్యలను నివారించడానికి మనం అనేక చర్యలు తీసుకుంటాము.. ముఖ్యంగా దోమలను నియంత్రించేందుకు.. ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు పలు చిట్కాలను అవలంభిస్తుంటారు.. వాటిలో ఒకటి దోమల కాయిల్స్ కాల్చడం.. దాని నుంచి వెలువడే పొగ దోమలను నియంత్రిస్తుంది..

మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే పొగ దోమలకు నిరోధకంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇంట్లో ఉన్న దోమలను బయటకు పంపేందుకు, తరిమికొట్టేందుకు పొగ బాగా సహాయపడుతుంది.. దీనిలో పలు క్రిమిసంహారక రసాయనాలను ఉపయోగిస్తారు.. అయితే.. దొమల కాయిల్స్ నుంచి వెలువడే పొగ.. మనషులకు ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Mosquito Coils

పర్యావరణానికి హానే..: మస్కిటో కాయిల్స్ వల్ల పర్యావరణం కూడా చెడు ప్రభావాలను చవిచూడాల్సి వస్తుంది. దాని విషపూరిత పొగ గాలిని కలుషితం చేస్తుంది.. విషపూరితం చేస్తుంది. దీనిని ఉపయోగించిన తర్వాత మనం చేతులు కడుక్కోవడం వల్ల అది నీటి వనరులలో కలిసిపోయి అక్కడి జంతువుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది.

దొమలను నివారించేందుకు సురక్షితమైన ఎంపికలు..: దోమలను పారద్రోలేందుకు, మీరు దోమల కాయిల్స్‌కు బదులుగా అనేక సురక్షితమైన ఎంపికలను చూడవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల ఎలక్ట్రిక్ రిపెల్లెంట్లు, యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.. వాటి ద్వారా పర్యావరణానికి హాని లేకుండా దోమల బెడదను వదిలించుకోవచ్చు. దీనితో పాటు, నిద్రిస్తున్నప్పుడు దోమతెరను ఉపయోగించండి.. ఇది సురక్షితమైన ఎంపికగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దీనిద్వారా దోమలను నివారించవచ్చు..




