Navaratri 2024: నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగిస్తే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..

అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా దుర్గాదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. ఈ కారణంగా చాలా మంది భక్తులు నవరాత్రులలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. మీరు కూడా నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగించినట్లు అయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి.. తొమ్మిది రోజులు పాటు ఆ అఖండ జ్యోతి ఆరిపోకుండా ఉండడం కోసం కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

Navaratri 2024: నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగిస్తే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..
Akhand Jyoti Diya
Follow us

|

Updated on: Oct 03, 2024 | 5:13 PM

తొమ్మిది రోజుల పాటు జరిగే పవిత్ర నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నవరాత్రి పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి 9 రకాల రూపాలను పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రి ఉత్సవాలు దుర్గాదేవి ప్రత్యేక ఆశీస్సులు పొందేందుకు ఒక సువర్ణావకాశంగా భావిస్తారు. ఈ సమయంలో ఆచారాల ప్రకారం దుర్గాదేవిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలై భక్తులను అనుగ్రహిస్తుంది.

నవరాత్రుల పూజలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 9 రోజుల పాటు అఖండ జ్యోతిని వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా దుర్గాదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. ఈ కారణంగా చాలా మంది భక్తులు నవరాత్రులలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. మీరు కూడా నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగించినట్లు అయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి.. తొమ్మిది రోజులు పాటు ఆ అఖండ జ్యోతి ఆరిపోకుండా ఉండడం కోసం కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శరన్నవరాత్రులు ఈ రోజు అంటే గురువారం, అక్టోబర్ 3, 2024 నుండి ప్రారంభం అయ్యాయి. నవరాత్రులు అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

అఖండ జ్యోతిని వెలిగించడానికి ముఖ్యమైన నియమాలు

  1. నవరాత్రులలో శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద| శత్రు బుద్ధి వినాశాయ దీపకాయ నమోస్తుతే|| దీపో జ్యోతి పరం బ్రహ్మ దీపో జ్యోతిర్జనార్ధనః | దీపో హరతు మే పాపం సంధ్యా దీప నమోస్తుతే || అనే ఈ మంత్రాన్ని జపించండి.
  2. అఖండ జ్యోతిని వెలిగించడానికి ఒత్తిగా కాటన్ బట్టని ఉపయోగించాలి. ఇలా వెలిగించిన దీపం తొమ్మిది రోజులు ఆరిపోకుండా చూసుకోవాలి. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  3. నిరంతర వెలిగే అఖండ జ్యోతిని ఎప్పుడూ నేలపై నేరుగా ఉంచకూడదు. ఈ అఖండ జ్యోతిని పెట్టే నేల మీద ధాన్యం లేదా బియ్యం పోసి అప్పుడు అఖండ జ్యోతిని పెట్టుకోవాలి.
  4. అఖండ జ్యోతిని వెలిగించడానికి నెయ్యి లేదా నూనెను ఉపయోగించాలి. అఖండ జ్యోతిని నెయ్యితో వెలిగిస్తున్నట్లయితే.. దానిని ఎల్లప్పుడూ పూజా గదికి కుడి వైపున ఉంచండి. అఖండ జ్యోతిని నూనెతో వెలిగిస్తే అప్పుడు ఆ దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమ వైపున ఉంచాలని గుర్తుంచుకోండి.
  5. అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత ఇంటికి తాళం వేయవద్దు. ఇంట్లో ఈ తొమ్మిది రోజులు ఎవరొకరు ఉండాలి.
  6. అఖండ జ్యోతిని వెలిగించే సమయంలో గతంలో ఉపయోగించిన దీపాన్ని పొరపాటున కూడా మళ్ళీ ఉపయోగించవద్దు.
  7. అదే విధంగా అఖండ జ్యోతిని వెలిగిస్తే తొమ్మిది రోజులు వెలిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదే సమయంలో నవరాత్రులు ముగిసిన తర్వాత.. అఖండ ద్వీపాన్ని అర్పవద్దు. ఆ ద్వీపం దానికి అదే ఆరిపోనివ్వండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో