AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు శ్రీకారం.. సాయంత్రం శైలిపుత్రిగా దర్శనమివ్వనున్న భ్రమరాంబిక

నేటి నుంచి మొదలైన దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో శ్రీభ్రమరాంబికా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ వాహనసేవలతో గ్రామోత్సవంగా శ్రీ స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అలానే మొదటిరోజైన ఈ రోజు సాయంత్రం అమ్మవారు శైలిపుత్రిగా దర్శనమివ్వనున్నారు. అలానే శ్రీ స్వామి అమ్మవారు బృంగి వాహనంపై ఆశీనులై క్షేత్ర పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు

శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు శ్రీకారం.. సాయంత్రం శైలిపుత్రిగా దర్శనమివ్వనున్న భ్రమరాంబిక
Navaratri In Srisailam
Surya Kala
|

Updated on: Oct 03, 2024 | 3:34 PM

Share

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని శక్తిపీఠము జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా గణపతిపూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలను ప్రారంభించమని ఈవో పెద్దిరాజు వెల్లడించారు. నేటి నుంచి మొదలైన దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో శ్రీభ్రమరాంబికా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ వాహనసేవలతో గ్రామోత్సవంగా శ్రీ స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అలానే మొదటిరోజైన ఈ రోజు సాయంత్రం అమ్మవారు శైలిపుత్రిగా దర్శనమివ్వనున్నారు. అలానే శ్రీ స్వామి అమ్మవారు బృంగి వాహనంపై ఆశీనులై క్షేత్ర పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

అనంతరం దేవస్థానం ఈవో పెద్దిరాజు మీడియాతో మాట్లాడుతూ దసరాకు విచ్చేయుచున్న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగతిన దర్శనం పూర్తి చేసుకునే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబును పలువురు రాజకీయ, ప్రముఖులను ఆహ్వానించామని కానీ సీఎం వస్తారా రారా అనేది క్లారిటీ లేదన్నారు. అలానే దసరా మహోత్సవాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తుడు శ్రీస్వామి అమ్మవారి ఉత్సవాలను వీక్షించి శ్రీ స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలు పొందాలని భక్తులను ఆలయ ఈవో పెద్దిరాజు విజ్ఞప్తి చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..